Site icon HashtagU Telugu

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

Thyroid

Thyroid

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరిగి పలేని పోనీ అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే థైరాయిడ్ కారణంగా బరువు పెరగకూడదు అనుకుంటే ఏం చేయాలో, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాడ్, ట్యూనా, సాల్మన్ వంటి చేపల్లో అయోడిన్ మెండుగా ఉంటుందట. ఈ చేపలను తింటే మీకు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయట. అలాగే అయోడిన్ కూడా సరఫరా అవుతుందని చెబుతున్నారు. దీన్ని గ్రిల్ చేసి లేదా బేక్ చేసి తినవచ్చట. ఇవి తింటే మీ ఆరోగ్యంగా బేషుగ్గా ఉంటుందట. అలాగే పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో కూడా అయోడిన్ పుష్కలంగా ఉంటుందట. వీటిని తింటే థైరాయిడ్ సమస్యలు రావట. అలాగే వీటిలో ఉండే కాల్షియం మీ ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.

అలాగే గుడ్లలో అయోడిన్ తో పాటుగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయట. కాగా గుడ్లలో సెలీనియం, జింక్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయట. గుడ్లను తింటే థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుందట. మీరు గుడ్లను ఉడకబెట్టి తినవచ్చట. లేదంటే ఆమ్లేట్ గా కూడా వేసుకొని తినవచ్చు అని చెబుతున్నారు. అయితే పైన చెప్పిన ఆహార పదార్థాలు తరచుగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ వల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. థైరాయిడ్ తో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. పైన చెప్పిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పటికీ బరువు అలాగే పెరుగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి అందుకు సంబంధించిన చికిత్స తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

Exit mobile version