Site icon HashtagU Telugu

Face Sweating: ముఖంపై చెమట ఎక్కువగా వస్తోందా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Face Sweating

Face Sweating

వేసవికాలంలో అలాగే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చెమటలు రావడం అన్నది సహజం. చెమటలు ఎంత బాగా వస్తే అంత మంచిది అని చెబుతూ ఉంటారు. కొందరికి అయితే చెమటలు విపరీతంగా వస్తూ ఉంటాయి. వెంట్రుకల నుంచి అరికాళ్ల వరకు చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎక్కువగా చాలామందికి ముఖం ప్రాంతంలో చెమటలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ముఖంపై ఎక్కువ చెమటలు చిరాకు తెప్పిస్తుంటాయి. దీంతో కొందరు పదేపదే పేస్ వాష్ చేస్తూ ఉంటారు. అయితే అలాకాకుండా ముఖంపై చెమటలను ఎలా తగ్గించుకోవచ్చో దానికోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్పైసీ ఫుడ్‌ ను తగ్గించడం.. స్పైసీ ఫుడ్‌ లో ఉండే నూనె, ఇతర పదార్ధాలు వంట్లో వేడిని పెంచుతాయట. వేసవిలో ఈ వేడి మరింత ఎక్కువ అవడం వల్ల చెమటలు విపరీతంగా వస్తాయని చెబుతున్నారు. స్పైసీ ఫుడ్‌ ను తగ్గిస్తే కొంత చెమటలు తగ్గే అవకాశముందట. అలాగే మానసిక ఒత్తిడి వల్ల కూడా చెమటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలామంది చిన్న చిన్న కారణాలకే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు చెమట విపరీతంగా వస్తూ ఉంటుంది. దీనిని తగ్గించాలంటే ప్రతీ రోజూ కొంత సమయం ధ్యానం చేసుకోవడానికి కేటాయించడం మంచిది. వ్యాయామం చేయడం వల్ల కూడా వత్తిడి తగ్గుతుంది. మద్యం తాగితే శరీరంలో వేడి పెరుగుతుంది. శరీరాన్ని హైడ్రేట్ కాకుండా డీహైడ్రేట్ చేస్తుంది. ఎంత ఎక్కువగా మద్యం తాగితే అంత చెమటలు పడతాయి.

కాబట్టి మద్యాన్ని తక్కువగా తాగడం మంచిది. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల కూడా చెమటలు ఎక్కువగా పడతాయ్. ఎప్పటి బీఎమ్‌ఐ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. బరువును తగ్గించుకొని అదుపులో పెట్టుకుంటే చెమట తగ్గడమే కాదు చాలా అనారోగ్య సమస్యలు తగ్గుతాయట. అలాగే వేసుకునే దుస్తులను బట్టి కూడా శరీరంలో చెమటలు వస్తుంటాయట. ఏ సీజన్ కి తగ్గట్టుగా ఆ సీజన్ లో బట్టలు వేసుకోవడం వల్ల కొంతవరకు చెమటలు తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. ముఖ్యంగా వేసేవి కాలంలో బిగుతుగా ఉండే బట్టలు కాకుండా కాస్త లూజుగా వదులుగా ఉండే బట్టలు వేసుకోవడం మంచిది. టైట్ ఫిట్టింగ్ బట్టలను, నైలాన్ ఫాబ్రిక్ వంటి వాటిని వేసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. స్నానం చేయడం శరీరంపై మురికి ఎక్కువగా ఉంటే కూడా చమటలు వస్తుంటాయ్. రోజూ ఉదయం నిద్దర లేవగానే, ఇంకా పడుకునే ముందు మొత్తంగా రెండు సార్లు స్నానం చేస్తే శరీరం నుంచి చెమటలు రాకుండా ఉంటుంది. వేసవికాలంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేయడం వల్ల ఫ్రెష్ గా అనిపించడంతో పాటు చెమటలు కూడా తక్కువగా పడతాయి.