Good Eating Habits : ఏమీ ఆలోచించకుండా ఏది పడితే అది తింటున్నారా.. ఆ అలవాటును ఇలా మానుకోండి..

మీరు ఆలోచించకుండా ఏదైనా తింటున్నారా? ఆకలిగా అనిపించకున్నా తింటున్నారా ? అయితే ఆ అలవాటును వదిలించుకోండి.

  • Written By:
  • Publish Date - January 22, 2023 / 08:00 AM IST

మీరు ఆలోచించకుండా ఏదైనా తింటున్నారా? ఆకలిగా అనిపించకున్నా తింటున్నారా ? అయితే ఆ అలవాటును వదిలించుకోండి. (Food Habits)

లేదంటే..  మీ ఆరోగ్యానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల మీ బరువు పెరగడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడ.. ఏదంటే అది తినడం వల్ల మీ శరీరంలో కేలరీలు పెరుగుతాయి. దానివల్ల మీ బరువు పెరగడం మొదలవుతుంది. అయితే  మీకున్న ఈ అలవాటును ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఒత్తిడిలో ఉన్నప్పుడు తినడం

మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు.. దాన్ని నియంత్రించడంలో భాగంగా ఏదైనా ఫుడ్ తింటుంటాం.. స్ట్రెస్ ని (Stress) తగ్గించేందుకు ఆహారం చాలా సహాయపడుతుంది.  కానీ దానిని మీ అలవాటుగా చేసుకోకండి. ఒత్తిడి లేదా విసుగును ఎదుర్కోవటానికి మీరు వేరే మార్గాన్ని వెతుక్కోవాలి. వాకింగ్ కు వెళ్లడం, పుస్తకం చదవడం, స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడడం వంటి అలవాట్లు చేసుకుంటే బెస్ట్.

* మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి

మిమ్మల్ని మీరు పనుల్లో బిజీగా ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల, మీరు విసుగు చెంది ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. దీని వలన మీరు ఏదైనా అనారోగ్యకర ఫుడ్ తినకుండా రక్షణ పొందుతారు. (Healthy Food)

 * ఇంట్లో జంక్ ఫుడ్ తినొద్దు

మీరు ఇంట్లో అనారోగ్యకరమైన స్నాక్స్ (Snacks) తినకుండా ఉండటం ముఖ్యం. మీ ఇంట్లో అనారోగ్యకరమైన ఫుడ్స్ ను వండి ఉంచినప్పుడు, మీ మనస్సు వాటిని తినడానికి పదే పదే ప్రయత్నిస్తుంది. అటువంటి ఫుడ్స్ ను ఇంట్లో తయారు చేయకుండా ముందుజాగ్రత్త పడితే బెస్ట్.బిస్కెట్లు, చిప్స్, నూడుల్స్ బదులు.. వండుకుని తినాల్సినవి కొనుక్కోండి.

* తగినంత నిద్రపోండి

మీరు రాత్రి తగినంత నిద్ర పోవడం అత్యవసరం. నిద్ర లేకపోవడం వల్ల.. మీ ఆకలి మరింత పెరుగుతుంది. అది తినాలి..ఇది తినాలి అనే కోరికలు పెరుగుతాయి. రోజూ రాత్రి 7 నుంచి 9 గంటలలోగా నిద్రపోవడానికి ప్రయత్నించండి.  అలాగే రాత్రి త్వరగా నిద్రపోవడానికి ప్రయత్నించండి.

* ఆరోగ్యకరమైన స్నాక్స్ మీతో ఉంచుకోండి

అనారోగ్యకరమైన స్నాక్స్ ని తినడానికి బదులుగా.. పండ్లు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఇంట్లో సిద్ధంగా ఉంచండి. మీకు ఆకలిగా ఉన్నప్పుడు, అనారోగ్యకరమైన వాటికి బదులుగా వీటిని తినండి.

* ఆలోచనాత్మకంగా తినండి

మీరు తినే ఫుడ్ ను జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. కడుపు నిండిన తర్వాత కూడా బలవంతంగా తినడానికి ప్రయత్నించవద్దు. అదే సమయంలో.. మీరు ఆకలితో లేకుంటే ఏదైనా ఇష్టం వచ్చింది తినడం మానుకోండి.  ఆలోచనాత్మకంగా తినడం ద్వారా మీ శరీరం టోన్‌గా ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఉండవు.