Site icon HashtagU Telugu

Dark Circles: డార్క్ సర్కిల్స్ సమస్యనా.. అయితే ఈ హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వాల్సిందే?

Mixcollage 13 Jul 2024 05 30 Pm 1152

Mixcollage 13 Jul 2024 05 30 Pm 1152

ఈ రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ముఖం అందంగా ఉన్నప్పటికీ కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి ముఖం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. స్త్రీలు ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఎన్నో రకాల చిట్కాలను, బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు రావు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డార్క్ సర్కిల్స్ రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉండగా అందులో టీవీ, మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా చూడటం అనేది ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

ఇకపోతే సర్కిల్స్ ని ఎలా పోగొట్టుకోవాలి అన్న విషయాన్ని వస్తే.. ఇందుకోసం కావాల్సిన పదార్థాలు కీర దోసకాయ తేనె. కీరదోసకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి. అలాగే ఇది మన చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. కీరదోసకాయలో ఉండే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ముఖం పై రంధ్రాల పరిమాణం పెరగకుండా చేస్తాయి. అంతేకాకుండా అలాగే ఇది చర్మం నల్ల బడటాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. తేనె నల్ల మచ్చలు చాలా వరకు తగ్గుతాయి. తేనె వాడకం వల్ల ముఖ రంధ్రాలు శుభ్రపడతాయి.

ముఖ చర్మాన్ని మృదువుగా ఉంచడంలో తేనె బాగా ఉపయోగపడుతుంది. తేనె చర్మాన్ని తేమగా ఉంచడానికి కూడా ఎంత గానో సహాయపడుతుంది. ఇకపోతే డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే.కీరదోసకాయను తీసుకుని దాన్ని గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులో 1 టీ స్పూన్ తేనెను కలపాలి. ఈ రెండు పదార్థాలను బాగా కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను వేళ్ళతో లేదా బ్రష్ తో కళ్ల కింద అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయాలి. ఆ తర్వాత కాటన్ సహాయంతో జాగ్రత్తగా శుభ్రం చేయాలి. ఈ విధంగా మీరు వారానికి 3 సార్లు చేయడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుతాయి.