Black Scrubs : బ్లాక్ హెడ్స్ తొలగించే హోంమేడ్ స్క్రబ్స్ ఇవే…!!

అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని చాలామంది అనుకుంటారు.

  • Written By:
  • Updated On - February 14, 2022 / 12:46 PM IST

అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని చాలామంది అనుకుంటారు. అందుకే మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. మెరిసే చర్మం సొంతం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చాలామందికి చర్మ సంరక్షణలో చాలా ఇబ్బందులు ఉంటాయి. మొటిమలు, పొడచర్మం, నల్లమచ్చలు లేదా బ్లాక్ హెడ్స్ ఇలాంటి సమస్యలతో సతమతమవుతుంటారు. మార్కెట్లో దొరికే క్రీములన్నీ ముఖానికి రాస్తుంటారు. అయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అయితే ఈ రోజుల్లో చాలా మంది బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకంటే దుమ్ము, దూళీ, కాలుష్యం వంటి వాటికి మన చర్మం గురవుతుంటుంది. వాటిని వదిలించుకోవడానికి చాలా సులభమైన హోంరెమెడీస్ ఉపయోగించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

చక్కెర , కొబ్బరి నూనె స్క్రబ్:
చక్కెర, కొబ్బరి నూనె స్క్రబ్ బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో చాలా సహాయపడుతుది. ముఖ్యంగా షుగర్ స్క్రబ్ సహాయకారిగా ఉపయోగపడుతుంది. దీనికోసం చక్కెరలో కొబ్బరి నూనె వేసి కలపండి. ఇప్పుడు వేళ్లతో మ్రుదువుగా ముఖాన్ని స్క్రబ్ చేయండి. వారానికి ఒకసారి వాడినట్లయితే మీ ముఖంలో చాలా తేడా కనిపిస్తుంది. కొబ్బరి నూనెకు బదులుగా మీరు జోజోబా నూనెను వాడినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది.

దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కను పొడిగా చేసి నల్లమచ్చలపై రుద్దితో మంచి ప్రయోజనం ఉంటుంది. దాల్చిన చెక్క పొడిలో నిమ్మకాయ రసాన్నివేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రుద్ది పది నుంచి పదిహేను నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత దాన్ని చల్లని నీటీతో శుభ్రపరచండి. ఇది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించడమే కాకుండా చర్మాన్ని బిగుతువుగా ఉండేలా మారుస్తుంది.

ఓట్ మీల్ తో స్క్రబ్:
ఓట్ మీల్ తో రెడీ చేసిన స్క్రబ్ బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. అంతేకాదు ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. దీన్ని రెడీ చేసేందుకు ఓట్ మీల్ పేస్టులో పెరుగు, నిమ్మరసం కలపండి. ఇప్పుడు మెత్తగా కలిపిన తర్వాత ముఖానికి అప్లై చేయండి. పదిహేను నిమిషాలపాటు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తేనె , పాలు కోసం స్క్రబ్:
పాలలో తేనె కలపండి. తేనె బాగా కలవాలంటే అందులో వెచ్చని పాలను కూడా ఉపయోగించవచ్చు. పాలు చల్లబడిన తర్వాత, ముఖాన్ని కడిగి ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. కనీసం 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. అందమైన ముఖం మీ సొంతం అవుతుంది.