జుట్టు రాలడం అన్నది సహజం. కొందరికి ఈ జుట్టు రాలడం అన్నది పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుంది. విపరీతంగా హెయిర్ ఫాల్ అయి పలుచని చుట్టూ సమస్యతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆడ మగ ఆడ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అయితే జుట్టు ఎక్కువ మొత్తంలో ఊడిపోతే బట్టదల వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జుట్టు ఎక్కువగా ఒత్తుగా ఉన్నప్పుడే అందంగా కనిపిస్తూ ఉంటారు. మరి హెయిర్ ఫాల్ సమస్య తగ్గి అందంగా కనిపించాలంటే ఏం చేయాలో ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బట్టతల రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి.
అందులో వయసు పెరగడం, వంశపారంపర్యం, ఆండ్రోజెన్ హార్మోన్ మార్పులే బట్టతలకి ప్రధాన కారణాలని నిపుణులుగా చెప్పవచ్చు. ఈ సమస్య బారిన పడకూడదంటే చిన్న వయసు నుంచే జుట్టును సంరక్షించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పౌష్టికాహారం తినడం, వారానికి ఒకసారి తలస్నానం చేయడం, నెత్తిని శుభ్రం చేయడం చేస్తే బట్టతల బారిన పడే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. ఆడవారు నుదుటిపై బట్టతల సమస్య నుంచి బయటపడాలంటే వారానికి ఒక్కసారైనా కలబంద జెల్ ను జుట్టుకు పెట్టి తలస్నానం చేయాలట. ఎందుకంటె కలబందలో ఉండే పోషకాలు జుట్టు, తలపై పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయట.
జుట్టు సంరక్షణకు మెంతులు కూడా ఒక బెస్ట్ నేచురల్ రెమెడీగా చెప్పవచ్చు. మీ జుట్టు పెరగడానికి లేదా జుట్టు రాలకుండా నియంత్రించడానికి కూడా మెంతులు సహాయపడతాయి. ఇందుకోసం మెంతులను బాగా నానబెట్టాలి. తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తలకు అప్లై చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది తలను చల్లగా ఉంచడంతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి వడకట్టి నీటిని తాగడం వల్ల శరీరం, జుట్టు రెండూ ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బట్టతలపై వెంట్రుకలు మొలవాలి అంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరిని ఉపయోగించాలని చెబుతున్నారు. ఇందుకోసం ఉసిరికాయ కొబ్బరి నూనె, ఉల్లిపాయ కరివేపాకు ఈ నాలుగింటిని బాగా మరిగించి, అను నేను తలకు అప్లై చేసి స్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని చెబుతున్నారు.
జుట్టు ఒత్తుగా పెరగడానికి గుడ్డులోని తెల్లసొన బాగా ఉపయోగపడుతుందట. ఈ తెల్లసొనను తీసుకుని జుట్టు మూలాలకు బాగా పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలట. దీనిలో ఉండే పోషకాలన్నీ జుట్టును నేచురల్ గా మెయింటైన్ చేయడానికి సహాయపడతాయని చెబుతున్నారు. వీటితో పాటుగా ఎక్కువ కెమికల్స్ లేని షాంపూలను మాత్రమే వాడాలట. సాధ్యమైనంత వరకు షాంపూలకు బదులుగా మెంతులను ఉపయోగించాలని దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
note : పైన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. అందులో ఎటువంటి సందేహాలు ఉన్నా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.