Wrist Pain : మణికట్టు నొప్పి తగ్గడానికి.. బలంగా తయారవ్వడానికి ఈ చిట్కాలు పాటించండి..

మణికట్టు నొప్పి(Wrist Pain) అనేది వ్యాయామాలు చేసేటప్పుడు, ఎక్కువగా ఫోన్(Phone) చూడడం, ఎక్కువగా కంప్యూటర్(Computer), ల్యాప్‌టాప్ వర్క్ చేయడం వలన, ఏదయినా పని చేసినప్పుడు బరువు ఎక్కువగా ఒక చేతిపై వేసుకున్నప్పుడు వస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Wrist Pain Causes

How to reduce Wrist Pain and strength to wrist

మణికట్టు నొప్పి(Wrist Pain) అనేది వ్యాయామాలు చేసేటప్పుడు, ఎక్కువగా ఫోన్(Phone) చూడడం, ఎక్కువగా కంప్యూటర్(Computer), ల్యాప్‌టాప్ వర్క్ చేయడం వలన, ఏదయినా పని చేసినప్పుడు బరువు ఎక్కువగా ఒక చేతిపై వేసుకున్నప్పుడు వస్తుంది. రోజువారీ వ్యాయామాలు చేసేటప్పుడు మణికట్టు బలంగా ఉండడానికి మనం మొదట కొన్ని వ్యాయామాలు చేయాలి. అవి మనకు వామప్ లాగా పనిచేస్తాయి. ఇంకా మన చేతి మణికట్టు బలంగా నొప్పి రాకుండా ఉంటుంది. కాబట్టి మణికట్టుకు బలం చేకూర్చేందుకు వ్యాయామాలు చేయాలి.

* అరచేతులను తెరుస్తూ, మూస్తూ ఉంచడం.
* మణికట్టును గుండ్రంగా తిప్పుతూ ఉండడం.
* అరచేతిని కిందకు మీదకు కదిలిస్తూ ఉండడం.
* మణికట్టుతో తరంగాల లాగా కదిలించడం.
* నేల మీద చేతిని పెట్టి ఉంచి మణికట్టును గుండ్రంగా తిప్పడం.

ఇలాంటి వ్యాయామాలను రోజూ చేసుకుంటూ ఉండడం వలన కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు బలంగా తయారవుతాయి. ఇంకా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇంకా మణికట్టు బలంగా తయారవుతుంది. దాంతో అన్ని రకాల వ్యాయామాలు చేయడానికి సులువుగా ఉంటుంది. మణికట్టు బలంగా తయారయ్యి మణికట్టు నొప్పి, వాపు వంటివి రాకుండా ఉంటాయి.

 

Also Read : Diabetes: డయాబెటీస్ ఉన్నవారు వీటిని తింటే కిడ్నీలు పాడవ్వడం ఖాయం?

  Last Updated: 09 Jun 2023, 10:01 PM IST