థైరాయిడ్ అనేది ఒక హార్మోన్ సమస్య అన్న విషయం మనందరికి తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ సమస్యతో బాధ పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. చిన్న పెద్ద అని వయసుతో తేడా లేకుండా చాలామంది ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా శరీరంలోని చాలా భాగాలలో నొప్పి కలుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఈ నొప్పిని భరించడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పాలి. ఈ నొప్పిని అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అయితే ఇలా థైరాయిడ్ నొప్పులు వచ్చినప్పుడు ఉపశమనం కోసం వెంటనే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
థైరాయిడ్ నొప్పి కాళ్లలో వస్తుందట. అలాగే కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత కారణంగా శరీర నొప్పి, చేతుల నొప్పి, గొంతు, గొంతు అడుగు భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుందట. ఈ నొప్పులను తగ్గించడానికి సొరకాయ జ్యూస్ ఎంతో బాగా పనిచేస్తుందట. సొరకాయ వండుకొని తినడంతో పాటు ఈ జ్యూస్ తాగడం వల్ల కూడా అనేక రకాల సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా థైరాయిడ్ వ్యాధి ఉంటే సొరకాయ జ్యూస్ ను ఖచ్చితంగా తాగాలట. ఈ జ్యూస్ ను మీరు ఉదయం పరగడుపున తాగితే థైరాయిడ్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే కొత్తిమీర తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చట. దీనిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
థైరాయిడ్ సమస్యలను తగ్గించడానికి పచ్చి కొత్తిమీర బాగా ఉపయోగపడుతుందట. ఇందుకోసం మీరు దీన్ని రోజూ జ్యూస్ గా లేదా చట్నీగా కూడా తినవచ్చని చెబుతున్నారు. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయట. వీళ్లు కొబ్బరి నీళ్లను తాగితే థైరాయిడ్ నియంత్రణలో ఉంటుందట. ఈ వాటర్ లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ థైరాయిడ్ నొప్పిని తగ్గిస్తాయట. అదేవిధంగా పసుపు ఎన్నో రోగాలకు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. థైరాయిడ్ తో బాధపడేవారికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుందట. అయితే ఇందుకోసం మీరు రాత్రి పడుకునే ముందు పాలలో కొద్దిగా పసుపు వేసుకొని తాగారట. ఈ పసుపు పాలు థైరాయిడ్ ను నియంత్రించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే తులసి, కలబంద రసం కూడా థైరాయిడ్ పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటుందట. రెండు టీస్పూన్ల తులసి రసంలో అర టీస్పూన్ కలబంద రసాన్ని కలిపి తీసుకుంటే థైరాయిడ్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఇది హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.