Site icon HashtagU Telugu

Pimples : మొటిమలను న్యాచురల్ గా తగ్గించుకోవాలా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

How to Reduce Pimples with home made tips

How to Reduce Pimples with home made tips

మొటిమలు(Pimples).. ఈ రోజుల్లో యువత(Youth) ప్రధానంగా ఎదుర్కొంటున్న చర్మ(Skin) సంబంధిత సమస్యల్లో ఇవీ ఒకటి. ఎంత అందంగా ఉన్న ముఖమైనా సరే.. ఒక్క మొటిమ ఉంటే చాలు. ఆ అందానికి మచ్చలా కనిపిస్తుంటుంది. దానిని ఎలాగైనా పోగొట్టాలని చాలామంది మొటిమలను గిల్లేస్తుంటారు. అది తగ్గకపోగా ఒకదానివెంట మరొకటి ముఖమంతా మొటిమలు ఏర్పడి ఆ తర్వాత గుంటలు పడిపోతుంది. మొటిమలు ఉన్నవారు తరచూ మంచినీటితో ముఖం కడుక్కుంటూ ఉండాలి. అలాగే మంచినీరు(Water) ఎక్కువగా తాగాలి. టీనేజ్ లో ఉన్నవారిలో Androgen Hormone ఉత్పత్తి వల్ల చర్మంలోని Sebaceous గ్రంథి Sebum అనే కొవ్వును విడుదల చేయడం వల్ల మొటిమలు ఏర్పడుతాయి.

మొటిమలను న్యాచురల్ గా తగ్గించుకునేందుకు ఆయుర్వేదంలో ఈ చిట్కాలను ఇంట్లోనే ట్రై చేయండి. ఖచ్చితంగా ఉపశమనం ఉంటుంది.

1.తులసి ఆకుల నుంచి తీసిన రసంలో కొద్దిగా పసుపు కలిపి మొటిమలు ఏర్పడిన చోట రాసుకోవాలి. ముఖమంతా రాసుకున్నా ఇబ్బందేమీ ఉండదు. అది ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి.

2.జాజికాయను పొడిగా చేసి.. ఆ పొడిలో పాలు కలిపి ముఖానికి రాసుకుంటే.. మొటిమలు తగ్గడంతో పాటు.. ముఖం కూడా మృదువుగా ఉంటుంది.

3.కేవలం బాహ్యంగానే కాకుండా.. కొన్ని జ్యూస్ లను తాగడం ద్వారా కూడా మొటిమలను తగ్గించుకోవచ్చు. క్యారెట్ జ్యూస్, బీట్ రూట్ జ్యూస్, ఇతర వెజిటబుల్ జ్యూస్ లు తాగడం వల్ల ముఖంలో కాంతి కూడా పెరుగుతుంది.

4.మడ్ ప్యాక్ తో కూడా మొటిమలను తగ్గించుకోవచ్చు. పొడిగా ఉన్న నేలలో 5 అడుగుల లోతులో ఉన్న మట్టిని తీసి ఎండబెట్టాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల ఎండిన మట్టిని 2 గంటల పాటు నీటిలో నానబెట్టి ముఖంపై ప్యాక్ లా వేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే చాలు.

5.చర్మ సంబంధిత వ్యాధులకు వేపాకు చక్కని ఔషధంలా పనిచేస్తుంది. ముఖంపై ఉండే మొటిమలను తొలగించేందుకు వేపాకు సహాయపడుతుంది. వేపాకులు, పుదీన ఆకులు, పసుపు కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మొటిమలు పోవడంతో పాటు చర్మం కూడా మెరుస్తుంది.

6. మొటిమలు ఎక్కువగా ఉన్న చోట ఐస్ క్యూబ్స్ తో మర్దన చేయడం వల్ల కూడా మొటిమలు తగ్గుతాయి.

7. యాపిల్ సైడర్ వెనిగర్ ను, నీరు సమానంగా కలిపి.. దూదితో ఆ మిశ్రమాన్ని ముంచి ముఖంపై రాసుకోవాలి.

8. రాత్రి పడుకునే ముందు వైట్ టూత్ పేస్ట్ ను మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. ఇది వాపును తగ్గించి, మొటిమలు పొడిబారేలా చేస్తుంది. రెండు- మూడు రోజుల్లోనే మొటిమలు తగ్గడాన్ని గమనించవచ్చు.

 

Also Read :   Tea : సాయంత్రం సమయంలో టీ అందరూ తాగొచ్చా? లేదా?

Exit mobile version