Kitchen Tips : తక్కువ నూనెతో వంట చేయడం ఎలా..?

నూనె లేనిది దాదాపుగా ఎలాంటి వంట చేయలేం. కానీ కొందరు ఏ వంట వండినా...అందులో నూనె మాత్రం పేరుకుపోతోంది. అలా ఉంటేనే వంటచేశామన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 12:00 PM IST

నూనె లేనిది దాదాపుగా ఎలాంటి వంట చేయలేం. కానీ కొందరు ఏ వంట వండినా…అందులో నూనె మాత్రం పేరుకుపోతోంది. అలా ఉంటేనే వంటచేశామన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. కానీ ఏ మాత్రం మంచిది కాదు. వంటల్లో నూనె ఎంత తగ్గిస్తే…ఆరోగ్యానికి అంత మంచిది. మరి తక్కువ నూనెతో వంట చేయడం ఎలా. ఇక్కడున్న కొన్ని చిట్కాలు ఫాలో అవ్వండి.

1. మీరు వంట చేసేటప్పుడు నూనెను తగ్గించడానికి నాన్ స్టిక్ ప్యాన్లు, కంటైనర్లు అనుకూలమైనవి. తక్కువ మొత్తంల నూనె కోసం నాన్ స్టిక్ ఆయిల్ సరిపోతుది. అందువల్ల ఆహారంలో ఎక్కువ నూనె చేరుతుందన్న భయం అసలు ఉండదు. నాణ్యమైన వంటసామాను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం.

2. వంట చేసే సమయంలో..మీకు ఇష్టం వచ్చినట్లు నూనె పోయకూడదు. కంటైనర్లో ఒక స్పూన్ పెట్టుకోవాలి. ఆ స్పూన్ తో ఎంత నూనె సరిపడుతుందో అంతే వేయాలి. అప్పుడు నూనె తక్కువగా ఉపయోగించే అవకాశం ఉంటుంది.

3. ఆహారాన్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా నూనెను ఉపయోగిస్తారు. తక్కువ నూనెతో డీప్ ఫ్రై చేయాలనుకుంటే పాన్ ఫ్రైని ఎంచుకోండి. ప్యాన్ మీద మూత పెట్టడం వల్ల తక్కువ నూనె అవసరం అవుతుంది. ఎందుకంటే తేమ ఆహారాన్ని ఫాస్ట్ గా వండేందుకు సహాయపడుతుంది.

4. ఆవిరి అనేది వంట నూనె వినియోగాన్ని గణనీయంగా తగ్గించే మరొక వ్యూహం. స్టీమింగ్ అంటే ఆవిరిలో ఆహారాన్ని వండటం. ఈ విధంగా ఆహారాన్ని తయారు చేసేందుకు నూనె అవసరం ఉండదు. ఈ రకమైన వంటకం ఆరోగ్యానికి మంచిది.

5. తక్కువ నూనెను ఉపయోగిచే మరో పద్దతి బేకింగ్. మీరు ఏదైనా గట్టికూరగాయలను వండినట్లయితే…మీరు వాటిని ముందుగా ఉడకబెట్టాలి. తర్వాత మసాలా, నూనె, మసాలా దినుసులు వేసి లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది.