Site icon HashtagU Telugu

Wheat Flour: షుగర్ తగ్గాలి అంటే గోధుమలు ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? ఇలా తింటే వ్యర్థమే!

Wheat Flour

Wheat Flour

మామూలుగా షుగర్ ఎక్కువగా ఉన్నవారు గోధుమ పిండిని తింటూ ఉంటారు. అలాగే గోధుమలతో రకరకాల రెసిపీలు కూడా తయారు చేసుకుని తింటూ ఉంటారు. అయితే షుగర్ తగ్గేందుకు గోధుమలను తీసుకోవడం మంచిదే కానీ ఎలా పడితే అలా తీసుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదట. కొన్ని రకాలుగా మాత్రమే తీసుకుంటే తిన్న ఫలితం దక్కుతుందని చెబుతున్నారు. మరి గోధుమ పిండిని ఎలా తీసుకోవాలో, ఎలా తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా చాలా మంది గోధుమపిండి ఏదైనా ఒకటే కదా అని మార్కెట్లో దొరికే ప్రాసెస్డ్ పిండి వాడుతూ ఉంటారు.

ఇంకొందరు గోధుమలతో స్వయంగా పిండి ఆడించుకొని ఆ పిండిని తింటూ ఉంటారు. ఇందులో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి షుగర్ ఉన్నవారికి బియ్యం బదులుగా తీసుకుంటే మంచిది. హోల్ గ్రెయిన్‌ నుంచి తయారైన గోధుమ పిండి షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. ఇది రక్త ప్రవాహంలో ఇన్సులిన్‌‌ ని తీసుకెళ్తుందట. హోల్ ఆట్టాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గోధుమపిండి గ్లైసెమిక్ ఇండెక్స్‌ని తగ్గించేందుకు ఎక్కువ ఫైబర్‌ తో కలిపి తీసుకోవడం మంచిది. దీంతో మొత్తం గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుందట. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ ని తీసుకుంటే శరీరంలోని గ్లూకోజ్ జీర్ణక్రియ మందగిస్తుందట. ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలని కూడా తగ్గిస్తుందట.

షుగర్ ఉన్నవారు ఎక్కువగా ఫైబర్ తీసుకుంటే వారి గ్లైసెమిక్, బరువు కంట్రోల్ అవుతుందట. అయితే గోధుమపిండి గ్లైసెమిక్ ఇండెక్స్‌ని తగ్గించేందుకు నీటితో ఉడికించాలి, లేదా ఆవిరితో ఉడికించాలి. నీరు ఆవిరిపై వండిన ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. ఇది రక్త ప్రవాహంలో గ్లూకోజ్ చేరడాన్ని తగ్గిస్తుందట. గోధుమపిండిని నీరు, పెరుగులో రాత్రంతా నానబెట్టి, ఆ తర్వాత తీసుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ విచ్ఛిన్నమై గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుందని చెబుతున్నారు. గోధుమపిండిలో కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియని నెమ్మదిగా చేస్తాయి. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న కూరగాయలు పండ్లు, కూరగాయలతో తీసుకోవాలట. గోధుమలు, గోధుమపిండితో తయారైన ఫుడ్స్‌ ని ప్రోటీన్‌ తో కలిపి తీసుకోవాలి. పనీర్, గుడ్ల వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ తో తీసుకోవడం చాలా మంచిది. అదే విధంగా వీటిని తక్కువగా తీసుకోవాలట. మంచిది కదా అని లంచ్, బ్రేక్‌ఫాస్ట్‌, డిన్నర్‌లో తీసుకోవడం కాదని, కేవలం ఒక్కసారి మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.