Site icon HashtagU Telugu

Back Pain : విపరీతమైన నడుంనొప్పి తగ్గాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

How to Reduce Back Pain follow these Tips

How to Reduce Back Pain follow these Tips

ఉద్యోగం చేసేవారు, ఇంటిలో ఉండేవారు ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా నడుము నొప్పి వస్తుంది. మనం కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోయినా, మనం నిద్ర పోయేటప్పుడు సరైన భంగిమలో పడుకోకపోయినా, మనం తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోయినా, మన చేసే పనిని బట్టి కూడా నడుం నొప్పి(Back Pain) వస్తుంది. శారీరక వ్యాయామాలు రోజూ చేయకపోయినా నడుం నొప్పి వస్తుంది. మనం తీసుకునే ఆహారం, వ్యాయామాల వలన నడుం నొప్పిని తగ్గించుకోవచ్చు.

మనం నడుం నొప్పి తగ్గడానికి మందులు వాడినా, ఆహారంలో చేసే మార్పుల వలన కూడా నడుం నొప్పి తగ్గుతుంది. ఆకుకూరలు, పాలు, పెరుగు, నిమ్మ జాతి పండ్లను ఆహారంలో భాగంగా తినాలి. నడుం నొప్పి తగ్గడానికి రోజూ శారీరక వ్యాయామాలు చేయడం, మనం పడుకునేటప్పుడు కాళ్ళ కింద దిండు పెట్టుకోవడం వంటివి చేయడం వలన నడుం నొప్పి తగ్గుతుంది. స్ట్రెచ్ ఎక్సర్సైజ్ లు వారానికి రెండు సార్లు చేయడం వలన నడుం నొప్పి తగ్గుతుంది. నడుం నొప్పి మొదలైనప్పుడు ఆడవారు ఎత్తు చెప్పులు వేసుకోకూడదు. వేసుకుంటే నడుం నొప్పి ఇంకా పెరుగుతుంది.

నలభయి సంవత్సరాలు వచ్చిన తరువాత మనలో కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్ తక్కువగా ఉంటే నడుం నొప్పి ఎక్కువగా వస్తుంది. కాబట్టి రోజూ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. అలాగే ఎక్కువగా కూర్చొని వర్క్ చేసేవారు మధ్య మధ్యలో లేచి అటు ఇటు నడవాలి. కంప్యూటర్ పైన వర్క్ చేసేటప్పుడు నిటారుగా కూర్చొని వర్క్ చేయాలి. అధిక బరువు ఉన్నవారికి నడుం నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.

 

Also Read : Mental Health : శారీరక ఆరోగ్యం ఉండాలంటే మానసిక ఆరోగ్యం ఎంత అవసరమో తెలుసా?