Site icon HashtagU Telugu

How To Reduce Anger : మీకు చిన్న విషయానికే కోపం వస్తుందా..? కారణం ఇదే కావచ్చు..!!

Anger

Anger

మనలో చాలామందిని చూస్తుంటాం. చిన్న చిన్న విషయాలకే కోపంతో రగిలిపోతుంటారు. అది చిన్న పిల్లలు కావచ్చు. పెద్దవాళ్లు కావచ్చు. ఈ కోపం వల్ల కొన్నిసందర్భాల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుంది. కోపంగా ఉండేవాళ్లతో మాట్లాడేందుకు చాలా మంది భయపడుతుంటారు. మీకు అలాంటి లక్షణం ఉన్నట్లయితే దీనికి కారణం ఏంటో తెలుసుకోండి. కోపం తనకు తానే శత్రువు. కాబట్టి దాన్ని నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాల్సిందే.

అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం , వివాహం, ఉద్యోగాలు, తల్లిదండ్రులు, పిల్లలు మొదలైన వాటికి సంబంధించిన ఏదైనా జీవితంలోని అనేక అంశాలలో కోపం సమస్యగా మారిందని పేర్కొంది. అంతే కాదు, ఈ అలవాటు వల్ల మీ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది.

కోపాన్ని ఎలా నియంత్రించాలి
ఈ కథనంలో, కోపానికి సంబంధించిన డేటాను పొందుపరిచారు. దీని ప్రకారం 25 శాతం మందికి ఎందుకు కోపాన్ని వ్యక్తం చేస్తున్నారో వారికే అర్థం కాదు . కోపం తెచ్చుకోవడం వల్ల మనకు ఎప్పటికీ ప్రయోజనం ఉండదన్న విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. మీకు కోపం వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల క్రమంగా మనం కోపానికి దూరంగా అవుతాము. ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది.

ఇలా కోపం తెచ్చుకునే అలవాటును తగ్గించుకోండి
మీకు కోపం వచ్చినప్పుడల్లా, దాని వెనుక కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కొంతమంది మాటలు మనకు కోపాన్ని రగిలిస్తాయి. కానీ ఎవరి మాటల వల్ల ఎవరికి హానీ జరుగుతుందన్న విషయాన్ని ఓసారి గమనించాలి. ఇరుగు పొరుగు వారి మాటలు విని మనం కోపాన్ని తెచ్చుకుంటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ముందుగానే జాగ్రత్త వహించండి
కోపం రావడం వెనుక ఏదైనా కారణం ఉండవచ్చు. ఉదాహరణకు మీరు కారు డ్రైవర్ మిమ్మల్ని రాంగ్ రూట్ లో తీసుకెళ్తుంటే మీకు కోపం రావచ్చు. కానీ అతనికి ఏ మార్గంలో తీసుకెళ్లాలో తెలుసు. అనవసరంగా అతనిపై కోపాన్ని చూపించకూడదు. దీనివల్ల ఎదుటివారు బాదపడతారన్న విషయాన్ని గమనించాలి. నెమ్మదిగా చెబితే…ఎదుటివారు కూడా బాధపడకుండా ఉంటారు.

ఆరోగ్యంపై కోపం ప్రభావాలు
చాలా సార్లు కోపాన్ని ఎమోషన్‌గా మాత్రమే చూస్తాం. కానీ ఆ అలవాటు ఏ మాత్రం మంచిది కాదు. కోపంగా ఉన్నప్పుడు, మన నాడీ వ్యవస్థతో సహా హార్మోన్ల సమతుల్యతలో మార్పు ఉంటుంది. దీని కారణంగా మీరు అధిక రక్తపోటు, పక్షవాతం, గుండె జబ్బులు , గ్యాస్ట్రిక్ అల్సర్ వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది .