Brain Worms: మనమందరం రోజూ కూరగాయలు తింటాం. కూరగాయలు మన రోజువారీ ఆహారంలో భాగం, ఆరోగ్యంగా ఉండటానికి కూడా అవసరం. అయితే కోతకు ముందు వాటిపై క్రిమిసంహారక మందులు చల్లుతారు. అలాగే కూరగాయలలో మట్టి కూడా ఉంటుంది. దీని వలన ఈ కూరగాయలను తిన్నప్పుడు శరీరంలోకి క్రిములు చేరవచ్చు. అందువల్ల కూరగాయలను సరిగ్గా శుభ్రం చేయడం ముఖ్యం. లేదంటే ఈ అపరిశుభ్రమైన కూరగాయల ద్వారా మెదడులోకి పురుగులు (Brain Worms) చేరే అవకాశం ఉంది.
మెదడులోని పురుగులు అంటే ఏమిటి? అవి ఎలా కనిపిస్తాయి? ఈ పురుగులు మెదడులోకి చేరకుండా ఉండటానికి కూరగాయలను ఎలా కడగాలి అనే విషయాలను ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. మెదడులోని పురుగులను దూరంగా ఉంచడానికి కూరగాయలను ఎలా కడగాలో వారి ద్వారానే తెలుసుకుందాం.
మెదడులో పురుగులు ఎలా వస్తాయి?
న్యూరోసిస్టిసెర్కోసిస్ (Neurocysticercosis) అంటే మెదడులోని పురుగు. ఈ పురుగును టీనియాసోలియం (Taenia Solium) అని అంటారు. ఈ పురుగు మెదడులో పాకే పురుగు కాదు. కానీ ఈ పురుగు గుడ్లు మట్టి కింద పెరిగే కూరగాయలలో మట్టి ఉండిపోయే కూరగాయలలో ముఖ్యంగా క్యాబేజీ వంటి వాటిలో ఉంటాయి.
ఈ కూరగాయలు కడుపులోకి వెళ్లినప్పుడు కడుపులోని యాసిడ్‌లు ఈ పురుగులను చంపలేవు. అవి ప్రేగుల నుండి మెదడులోకి చేరుతాయి. ఈ గుడ్లు మెదడుకు చేరినప్పుడు వాపు కలిగిస్తాయి. ఎందుకంటే మెదడులోకి ఏదైనా బయటి వస్తువు వెళ్లినప్పుడు శరీరం దానికి ప్రతిస్పందిస్తుంది. మెదడులోని ఈ పురుగుల గుడ్ల కారణంగా మెదడులో వాపు వస్తుంది. వాపు కారణంగా తలనొప్పి వస్తుంది. ఫిట్స్ వస్తుంది. పిల్లలలో ఫిట్స్ రావడానికి ఒక ప్రధాన కారణం న్యూరోసిస్టిసెర్కోసిస్. ఈ పురుగుల నుండి రక్షించుకోవడానికి కూరగాయలను సరిగ్గా కడగడం ఒక్కటే మార్గం.
Also Read: H1B Visa: హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!
మెదడు పురుగుల నుండి రక్షణ కోసం కూరగాయలను ఎలా కడగాలి?
మెదడులోకి పురుగులు రాకుండా ఉండాలంటే కూరగాయలను శుభ్రం చేసే సరైన పద్ధతి తెలుసుకోవాలి. వైద్యులు చెప్పిన ప్రకారం.. పారుతున్న నీటిలో శుభ్రం చేయండి. కూరగాయలను పంపు నుండి పారుతున్న నీటిలో 5 నిమిషాల పాటు కడగాలి. ఆ తర్వాత కూరగాయలను ఆరబెట్టి ఆపై నిల్వ చేసుకోవాలి. బేకింగ్ సోడా ఉపయోగించండి. ఒక చెంచా బేకింగ్ సోడాను 2 గ్లాసుల నీటిలో వేసి ఆ నీటిలో కూరగాయలను 5 నుండి 10 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత పారుతున్న నీటిలో కడిగి, ఆరబెట్టి నిల్వ చేయండి.
ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి
పొరలున్న కూరగాయలు: క్యాబేజీ, కాలీఫ్లవర్ (Cauliflower) వంటి పొరలున్న కూరగాయలను శ్రద్ధగా కడగాలి.
పచ్చి కూరగాయలు వద్దు: పచ్చి కూరగాయలను తినకుండా ఉండాలి.
బయటి ఆహారం: బయట నూడుల్స్, బర్గర్ లేదా సలాడ్ వంటి వాటిలో పచ్చి కూరగాయలను తక్కువగా తినండి.
