Peanut Chikki : షాప్స్ లో అమ్మే పల్లిపట్టి.. ఇంట్లో రుచిగా ఎలా చేయాలంటే..? పల్లిపట్టి ప్రయోజనాలు..

మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా పల్లిపట్టి తయారుచేసుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 04:31 PM IST

Peanut Chikki : పల్లిపట్టి అనేది వేరుశనగలు, బెల్లం కలిపి తయారుచేసే ఒక రకమైన స్వీట్. దీనిని మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా వాడతారు. ఇది స్వీట్ షాప్స్ లో పాటు బయట షాప్స్ లో కూడా దొరుకుతుంది. దీనిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా పల్లిపట్టి(Palli Patti) తయారుచేసుకోవచ్చు.

పల్లిపట్టి తయారీకి కావలసిన పదార్థాలు..

* పల్లీలు ఒక కప్పు
* బెల్లం అరకప్పు
* నీరు పావుకప్పు
* స్పూన్ నెయ్యి
* పావు స్పూన్ యాలకుల పొడి

ముందుగా పల్లీలు ఒక పది నిముషాలు నీళ్లలో నానబెట్టాలి. తరువాత వాటిని నీటి నుండి తీసి ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరిన తరువాత వాటిని ఒక గిన్నెలో నెయ్యి వేసి వేయించుకోవాలి. అనంతరం పల్లీలను ముక్కలు ముక్కలు అయ్యేలా నిలపాలి. పొయ్యి మీద ఒక గిన్నెలో నీరు, బెల్లం వేసి పాకం చిక్కగా వచ్చేవరకు మరిగించాలి. పాకం తయారయ్యాక అంతకుముందు వేయించుకున్న పల్లీలను, యాలకుల పొడిని మనం తయారుచేసుకున్న పాకంలో వేసి బాగా కలపాలి. అనంతరం ఒక ప్లేట్ కు నెయ్యి రాసి పల్లీలు పాకం మిశ్రమాన్ని ప్లేట్ లో పోసుకోవాలి. అది చల్లారి గడ్డ కట్టేముందు చాకుతో మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమం గడ్డ కట్టక పల్లిపట్టి రెడీ అయినట్టే.

పిల్లలు, గర్భిణీ స్త్రీలు రోజూ ఒక పల్లిపట్టి ని తినడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. దీనిలో ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్ వంటివి ఉన్నాయి. పల్లిపట్టి తినడం వలన అది మన శరీరంలో రక్తహీనతను తగ్గిస్తుంది. ఒంట్లో శక్తి పెరిగేలా పల్లిపట్టి ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థని కూడా పల్లిపట్టి తినడం వల్ల మెరుగుపరుచుకోవచ్చు.

 

Also Read : Arthritis : అధిక వేడితో ఆర్థరైటిస్ రోగుల సమస్యలు కూడా పెరుగుతాయా? నిపుణుల ఏమంటున్నారు.?