Site icon HashtagU Telugu

Summer: ఎండల్లో తిరిగి నీరసించి పోయారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Summer

Summer

ప్రస్తుతం ఒక వైపు వర్షాలు పడుతున్న కూడా ఎండలు మాత్రం తగ్గడం లేదు. కొద్ది సేపు ఎండలో అలా వెళ్లి వస్తే చాలు చల్ల టైడ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకే వేసవిలో ఎక్కువ నీరు పానీయాలు తాగాలని చెబుతూ ఉంటారు. అయితే ఎన్ని నీళ్లు తాగినా ఒక్కోసారి నీరసంగానే అనిపిస్తూ ఉంటుంది. నీరసం కారణంగా తల తిరిగిపోవడం, లో జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు కేవలం నీళ్లే కాకుండా వాటికి మరింత శక్తినిచ్చే పదార్థాలు కొన్ని కలిపి తీసుకుంటే మంచిది అని చెబుతున్నారు. కళ్లు తిరగడం, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవిలో మాములు నీటితో పాటు కొద్దిగా నిమ్మరసం కలిపిన నీళ్లు తిడుకోవడం మంచిది అని చెబుతున్నారు.

చిటికెడు ఉప్పు వేసుకున్నా మంచిదే. మనం తరచుగా వంటకు వాడే ఉప్పు కాకుండా హిమాలయన్ లేదా పింక్ సాల్ట్ వాడితే బెటర్. నీళ్లు కూడా కాస్తంత చల్లగా ఉండాలి. కుండలో నీళ్లైతే ఇంకా మంచిదని చెబుతున్నారు. ఇలా నీళ్లలో నిమ్మరసం, కాస్తంత సాల్ట్ వేసి కలుపుకుని తాగితే శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అందుతాయట. ఈ నీటి వల్ల ఎండ కారణంగా వచ్చే తలనొప్పి, నీరసం లాంటివి తగ్గిపోతాయని చెబుతున్నారు. వేసవి నీరసాన్ని పోగొట్టడానికి మరో చిట్కా కూడా ఉంది. డీప్ ఫ్రిజ్ లో ఉన్న ఐస్ ముక్కలను మణికట్టు, మెడ లేదా మోకాళ్ల వెనక భాగంలో ఉంచాలట. ఆ చల్లదనం అంతా శరీరానికి అందే వరకూ వెయిట్ చేయాల. కాసేపటికి బాడీ టెంపరేచర్ తగ్గడంతో పాటు క్రమంగా కళ్లు తిరగడం తగ్గిపోతుందట. ఐస్ ముక్కలు అందుబాటులో లేకపోతే ఒక సాఫ్ట్ క్లాథ్ ని చల్లని నీళ్లతో తడిపి మణికట్టు వద్ద పెట్టాలట. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గేంత వరకూ దాన్ని అలాగే ఉంచాలని, ఇలా తరచుగా చేస్తే వేసవి వేడి నుంచి కాస్తంత ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.

అలాగే ఎండకు వెళ్లి వచ్చిన తర్వాత కళ్ళు తిరిగినట్టు అనిపించిన వెంటనే కింద కూర్చోవాలట. తర్వాత కాళ్లను పైకి పెట్టి గోడ లేదా ఇంకేదైనా సపోర్ట్ తీసుకుని వాటికి ఆనించాలట. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంద. క్రమంగా శరీరం బ్యాలెన్స్ అవుతుందని, కనీసం పది నిముషాల పాటు ఇలా ఉంచితే ఫలితాలు కనిపిస్తాయి. వేడిని తగ్గించుకునేందుకు మరో టిప్ ఉంది. అదేంటంటే జుట్టుపై చల్ల నీళ్లు పోసుకోవాలట. అంటే జుట్టుని బాగా తడపాలి. లేదంటే స్ప్రే చేసుకున్నా సరిపోతుందట. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న వేడంతా బయటకు వచ్చేస్తుందని, క్రమంగా టెంపరేచర్ తగ్గి బాడీ చల్లబడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ​అలోవెరాతో కూడా వేసవి వేడిని తగ్గించుకోవచ్చట. అలోవెరా జెల్ ని మెడ,నుదురు, చంకల కింద పెట్టుకోవాలట. ఇలా చేయడం వల్ల ఇన్ ఫ్లమేషన్ చాలా త్వరగా తగ్గిపోతుందని, అప్పటి వరకూ వేడిగా ఉన్న ఒక్కసారిగా చల్లబడుతుందని చెబుతున్నారు.

కీరదోసకాయ లేదా పుచ్చకాయ ముక్కలను నోట్లో ఉంచుకుని కాసేపు ఆ రసాన్ని పీల్చడం వల్ల త్వరగా బాడీ డీహైడ్రేట్ అవుతుందట. అయితే ఈ ముక్కలు చల్లగా ఉంటే రిజల్ట్ ఇంకా త్వరగా కనబడుతుందని, శరీరం లోపలి ఉష్ణోగ్రత త్వరగా తగ్గిపోయి హీట్ స్ట్రెస్ కంట్రోల్ లోకి వచ్చేస్తుందని, డీప్ బ్రీత్ తీసుకోవడం ద్వారా కూడా బాడీ టెంపరేచర్ ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల నరాల వ్యవస్థ మెరుగవడంతో పాటు శరీరానికి ఆక్సిజన్ ఇంకాస్త ఎక్కువగా అందుతుందని, తద్వారా ఉష్ణోగ్రత తగ్గుతుందని,బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా వెంట ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఏ మాత్రం ఇబ్బందిగా అనిపించినా వెంటనే నీళ్లు తాగాలని, కొబ్బరి నీళ్లు, చెరకు రసం లాంటివీ తీసుకోవాలని, దాని వల్ల బాడీ డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుందని చెబుతున్నారు.