Site icon HashtagU Telugu

Ridge Gourd Soup : బీరకాయ సూప్ ఎప్పుడైనా తాగారా? ఇలా చేసుకొని తాగేయండి..

How to make Ridge Gourd Soup in Home

How to make Ridge Gourd Soup in Home

బీరకాయ(Ridge Gourd)తో మనం కూర, పచ్చడి చేసుకొని తింటూ ఉంటాము. బీరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఒంటికి చలువ చేస్తుంది. మన శరీరంలో ఉండే వేడిని బీరకాయ తగ్గిస్తుంది. కానీ చిన్నపిల్లలు కొంతమంది తినడానికి ఇష్టపడరు అలాంటి వారికి మనం బీరకాయతో ఎంతో రుచిగా ఉండేలా బీరకాయ సూప్ తయారు చేసి ఇవ్వొచ్చు. అది ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా మన ఆరోగ్యానికి కూడా మంచిది. దీనిని పిల్లలు, పెద్దవారు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు.

బీరకాయ సూప్ తయారీకి కావలసిన పదార్థాలు..

* బీరకాయ ఒకటి ( చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి)
* నానబెట్టిన బియ్యం ఒక కప్పు
* నూనె కొద్దిగా
* తాలింపు దినుసులు ఒక స్పూన్
* ఎండుమిర్చి రెండు
* వెల్లుల్లి తరుగు ఒక స్పూన్
* ఉల్లిపాయ ఒకటి ( చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి)
* బంగాళాదుంప ఒకటి ( పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి)
* ఎర్ర గుమ్మడికాయ ముక్కలు అర కప్పు
* పసుపు కొద్దిగా
* నల్ల మిరియాల పొడి కొద్దిగా
* కొత్తిమీర కొద్దిగా
* ఉప్పు తగినంత
* నిమ్మకాయ ఒకటి
* నీరు రెండు లీటర్లు

పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దానిలో నూనె వేసి తాలింపు పెట్టాలి తరువాత ఎండుమిర్చి వేయాలి. వేగిన తరువాత ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. తరువాత బంగాళాదుంప, గుమ్మడికాయ, బీరకాయ, పసుపు, నల్ల మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత నానబెట్టిన బియ్యాన్ని వేయాలి. రెండు లీటర్ల నీటిని పోసి బాగా కలుపుతూ జావ లాగా చేసుకోవాలి. కూరగాయలు అన్నీ మెత్తగా ఉడికేవరకూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చివరకు కొత్తిమీర తరుగు, నిమ్మకాయ రసం పిండి దించుకోవాలి. చల్లారిన తర్వాత జావలాగా ఉండే బీరకాయ సూప్ రెడీ. సాయంత్రం వేళల్లో ఈ సూప్ ని తాగొచ్చు.

 

Also Read :  Weight Loss: యాపిల్ జ్యూస్ తో బరువు తగ్గవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?