Site icon HashtagU Telugu

Pink Lips: లిప్ స్టిక్ వాడకపోయినా పెదాలు ఎర్రగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

Pink Lips

Pink Lips

మామూలుగా చాలామందికి సహజంగానే పెదవులు ఎరుపు లేదంటే పింక్ కలర్ లో ఉంటే మరికొందరికి మాత్రం నలుపు కలర్ లో ఉంటాయి. అయితే నలుపు రంగులో ఉండే పదాలను ఎరుపు రంగులోకి మార్చుకోవడం కోసం ఆడవారు అయితే లిఫ్టిక్లు వంటివి అప్లై చేస్తూ ఉంటారు. కానీ మగవారు మాత్రం అలాంటివి ఏమీ పట్టించుకోరు. అయితే లిఫ్టిక్ వంటివి ఎక్కువగా ఉపయోగించినా కూడా లేనిపోని సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు సహజంగానే లిఫ్టిక్ వంటివి ఉపయోగించకుండా పెదవులను ఎరుపు రంగులోకి ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా స్త్రీలు తమ పెదవులు ఎర్రగా మారేందుకు షాపుల్లో కొనే కాస్మొటిక్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందులోనూ చాలా రకాల లిప్ స్టిక్ లను ఉపయోగిస్తుంటారు. అయితే ఇవి కొంతమందికి ఎలాంటి దుష్ప్రభావాలను చూపవు. కానీ మరికొంతమందికి మాత్రం చాలా సైడ్ ఎఫెక్ట్స్ ను చూపిస్తాయి. దీనివల్ల కొందరి పెదవులు నల్లగా మారడం వంటి సమస్యలు కూడా వస్తాయట. అయితే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండకూడదు అనుకుంటే మన ఇంట్లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ తో పెదాలను ఎర్రగా, అందంగా మార్చుకోవచ్చట.

ఇందుకోసం బాదం పౌడర్, మిల్క్ క్రీమ్ రెండింటినీ బాగా మిక్స్ చేసి పెదాలకు అప్లై చేయడం వల్ల నల్లని పెదాలు ఎర్రగా మారుతాయట. కాగా బాదం పలుకుల్లోని విటమిన్ ఇ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పెదాలను తేమగా ఉంచి పెదవులు నల్లగా మారకుండా చేస్తాయట. అలాగే దానిమ్మలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందట. అంతేకాకుండా ఇది పెదవులను ఎర్రగా మార్చడానికి కూడా ఎంతగానో సహాయపడుతుందని చెబుతున్నారు. ఇందుకోసం దానిమ్మ గింజలను మెత్తగా గ్రైండ్ చేసి రోజ్ వాటర్ తో కలపాలట. దీనిని పెదాలకు అప్లై చేయాలి. ఇలా రోజూ లేదా వారానికి రెండుసార్లు చేస్తే పెదవులు ఎర్రగా మారతాయట.

అలాగే కలబందలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పెదవులను సంరక్షించడానికి బాగా సహాయపడతాయట. మన పెదవులు తేమగా ఉన్నప్పుడు అవి పొడిబారకుండా ఉంటాయి. కాబట్టి అలోవెరా జెల్ తో పాటు పసుపును అప్లై చేయాలట. కలబందలోని తేమ గుణాలు పెదవులు పొడి బారకుండా, ఎర్రగా ఉండటానికి బాగా సహాయపడతాయని చెబుతున్నారు.