ప్రస్తుత రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య డయాబెటిస్. ఈ డయాబెటిస్ కారణంగా చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే చాలు మరణించే వరకు పోదు. ఇక షుగర్ వ్యాధి వస్తే రక్తంలో ఎప్పటికప్పుడు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే అది ప్రాణాలు తీయవచ్చు. అయితే షుగర్ వ్యాధి వంశపార్యపరంగా వస్తూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవడానికి మార్కెట్ లో ఎన్నో రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు పండ్లు తీసుకోవడం వల్ల కూడా షుగర్ అదుపులో ఉంటుందట.
అందులో జామ పండ్లు కూడా ఒకటి. వీటిని సరైన పద్ధతిలో తీసుకుంటే షుగర్ తప్పకుండా అదుపులో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరి అందుకోసం జామ పండ్లను ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జామలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇందులో ఆరెంజ్ లో కంటే ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అలాగే విటమిన్ బి2, ఇ, కె, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. జామపండు అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. జామ, జామ ఆకు, కాండంలో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. అయితే జామ పండ్లను ఎప్పుడైనా సరే దోరగా ఉన్నవి తీసుకోవాలి. వాటిని మెత్తగా మిక్సీ పట్టి అందులో 250 మి.లీ నీరు, ఒక గ్లాస్ జ్యూస్ కి నీరు కలిపి ఉంచాలి. దీనిని మరుసటి రోజు పరగడపున తీసుకోవాలి.
ఇలా జామపండ్లని తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుందట. జామలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణని నెమ్మదిస్తుంది. ఇది చెక్కర పెరగకుండా చేస్తుందట. అదే విధంగా, జామపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుంది. షుగర్ లెవల్స్ ని తక్కువ స్థాయిలో మాత్రమే పెంచుతుంది. మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి చాలా మంచిదని కాబట్టి మధుమేహం ఉన్నవారు జామకాయలు తప్పకుండా డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు.