Site icon HashtagU Telugu

Sarvapindi : కామన్ మ్యాన్ పిజ్జా “సర్వపిండి” తయారీ ఇలా..

Common Man Pizza Sarvapindi

How To Make Common Man Pizza Sarvapindi

Common Man Pizza Sarvapindi : తెలంగాణ ప్రజలు అత్యంత ఇష్టపడే పిండి వంటకం “సర్వపిండి”.. చాలామంది ఇళ్లలో ఈ వంటకం చేస్తుంటారు. బియ్యపిండి, వేరుశనగతో తయారు చేసే గుండ్రటి ఆకారంలో ఉండే రుచికరమైన పాన్ కేక్ ఇది. దీన్ని తప్పల చెక్క ,గిన్నప్ప అని కూడా పిలుస్తారు. కామన్ మ్యాన్ పిజ్జాగా సర్వపిండికి (Sarvapindi) పేరుంది.ఏళ్ల క్రితం ఒక గ్రామంలోని మహిళకు ఆకలిగా ఉండటంతో తన ఇంట్లో బియ్యప్పిండి తప్ప మరేమీ ఉండకపోవడంతో.. తక్కువ నూనెతో కొత్త వంటకాన్ని చేసుకోవడంతో అదే సర్వపిండిగా మారిందని చెప్తారు.

సర్వపిండి (Sarvapindi) తయారీలో కావాల్సిన పదార్థాలు

  1. బియ్యంప్పిండి – ఒక కప్పు
  2. కొత్తిమీరు తురుము – రెండు స్పూన్లు
  3. కరివేపాకు తురుము – ఒక స్పూను
  4. కారం – రెండు స్పూన్లు
  5. ఉల్లిపాయ – ఒకటి
  6. ఉప్పు – రుచికి సరిపడా
  7. నానబెట్టిన శెనగపప్పు – రెండు స్పూన్లు
  8. నువ్వులు – రెండు స్పూన్లు
  9. పల్లీలు – రెండు స్పూన్లు
  10. వెల్లుల్లి రెబ్బలు – నాలుగు
  11. ధనియాలు – ఒక స్పూను
  12. జీలకర్ర – ఒక స్పూను
  13. నూనె – తగినంత

తయారీ ఇలా..

  1. ఒక బౌల్ తీసుకుని దానిలో బియ్యంపిండి వేయాలి.
  2. దానిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, కరివేపాకులు, కారం, నువ్వులు, శెనగపప్పు, వేయించిన పల్లీలు వేసి కలపాలి.
  3. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా మిక్సీలో పొడి చేసుకోవాలి.
  4. ఈ పొడిని, ఉప్పుని కూడా బియ్యంపిండి మిశ్రమంలో కలపాలి.
  5. ఆ పిండిలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  6. పిండి ముద్దని కలిపి ఓ అయిదు నిమిషాల పాటూ పక్కన పెట్టుకోవాలి. పైన మూత పెట్టాలి.
  7. ఇప్పుడు కళాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి మొత్తం పరచాలి.
  8. పిండి ముద్దని వేసి కళాయి అడుగున వేసి చపాతీలా చేత్తోనే ఒత్తుకోవాలి.
  9. మధ్యలో అయిదారు రంధ్రాలు చేసుకోవాలి. ఆ రంధ్రాల్లో కూడా నూనె వేయాలి.
  10. స్టవ్ వెలిగించి చిన్న మంట మీద ఉంచాలి. పైన మూత పెట్టాలి.
  11. దాదాపు ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటూ ఉడికించాలి.
  12. అంతే సర్వపిండి రెడీ అయిపోతుంది.

Also Read:  Salary Account vs Savings Account: మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి..