Site icon HashtagU Telugu

BellyFat : ఈ నాలుగు టిప్స్ పాటిస్తే.. పొట్ట దగ్గరి కొవ్వు కొవ్వొత్తిలా కరగడం ఖాయం..

Bellyfat Loss

Bellyfat Loss

BellyFat : ఆధునిక జీవనశైలిలో.. ఆరోగ్యం మాట పక్కనపెడితే.. చాలా మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నచ్చిన డ్రస్ వేసుకోలేరు. నలుగురిలో ఇబ్బందిగా ఫీలవుతారు. కొద్దిగా తిన్నా సరే.. పొట్ట ముందుకు వచ్చేస్తుంది. వీటితో పాటు షుగర్, బీపీ, గుండెజబ్బులు వంటి సమస్యలు ఫ్రీ గా వచ్చేస్తాయ్. జంక్ ఫుడ్, స్వీట్స్, నూనెలో ఎక్కువగా వేయించిన పదార్థాలను తీసుకోవడమే పొట్టపెరగడానికి ప్రధాన కారణాలు. పెరిగిన పొట్ట ను తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం ఉండదు. పొట్టను కరిగించే లోషన్లు, పొడులు వాడి ఇబ్బంది పడేకంటే ఆహారపు అలవాట్లలోనే మార్పులు చేసుకోవడం వల్ల చాలా సులభంగా పొట్టను తగ్గించుకోవచ్చు. అలాగే శరీర బరువు కూడా తగ్గుతుంది.

పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్నవారు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. వాటిలో ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్స్, ఫైబర్, మినరల్స్, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయి. వాటిలో ఉండే ఫైబర్ శరీరంలో అదనంగా పేరుకున్న కొవ్వును కరిగించడంలో దోహదపడుతుంది. శరీర బరువు కూడా సులభంగా తగ్గుతుంది.

అలాగే ఎక్కువగా పండ్లు తింటూ ఉండాలి. వాటిలో ఫైబర్ ఎక్కువ, క్యాలరీలు తక్కువ ఉంటాయి. త్వరగా కడుపునిండిన భావన కలగడంతో.. ఇతర చిరుతిళ్లు తినాలన్న కోరిక ఉండదు. ఊబకాయం వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పొట్టదగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్నవారు మద్యాన్ని తీసుకోవడం కూడా తగ్గించాలి. ఆల్కహాల్ లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అవి కరిగించుకోకపోతే పొట్టవద్ద కొవ్వుగా పేరుకుపోతాయి.

అధిక బరువు ఉన్నవారు ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవాలి. ఇది శరీరానికి చాలా అవసరం. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం ద్వారా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆ తర్వాత జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. ఇలాంటి సింపుల్ టిప్స్ పాటిస్తే పెరిగిన పొట్టను కరిగించుకోవడం చాలా సులభం.

 

Exit mobile version