Site icon HashtagU Telugu

Lose Weight: ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి?

Mixcollage 09 Jul 2024 05 52 Pm 8256

Mixcollage 09 Jul 2024 05 52 Pm 8256

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ అధిక బరువు కారణంగా కొంత మంది స్వతంత్రంగా కూడా వారి పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే బరువు తగ్గడానికి ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేయడం, డైట్ ఫాలో అవ్వడం, నాచురల్ రెమెడీస్ ఫాలో అవ్వడం ఇలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా కూడా బరువు తగ్గక దిగులు చెందుతూ ఉంటారు. అయితే చాలామంది బరువు తగ్గాలంటే కేవలం ఎక్ససైజ్ మాత్రమే చేయాలని తెగ కష్టపడుతూ ఉంటారు.

అయితే ఎక్సర్సైజ్ చేయకుండానే బరువు తగ్గవచ్చు అంటున్నారు వైద్యులు. మీరు కూడా అలా ఎక్సర్సైజ్ చేయకుండానే బరువు తగ్గాలని అనుకుంటున్నారా! మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బరువు తగ్గాలి అనుకున్న వారు ముందుగా చేయాల్సిన పని మంచి ఆహారాన్ని తీసుకోవాలి. పదేపదే ఆయిల్లో వేయించిన ప్రాసెస్ చేసిన ఆహారాలను అస్సలు తినకూడదు. వాటికీ బదులుగా మీరు మీ ఆహారంలో ఆరోగ్యకరమైన పండ్లను, కూరగాయలను చేర్చాలి. వీటిల్లో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది.

ఒత్తిడి మీ శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అలాగే ఒత్తిడికి లోనైప్పుడు ఏ పనిచేస్తున్నామో కూడా తెలియదు. దీనివల్ల ఎంత తింటున్నారు అన్నది కూడా తెలియకుండా తింటూనే ఉంటారు. దీనివల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. అందుకే ఒత్తిడికి, యాంగ్జైటీకి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అలాగే ఎక్కువగా చిప్స్ బిస్కెట్స్ ప్రాసెస్ చేసిన స్నాక్స్ తినడం వల్ల విపరీతంగా పరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని తినడం మానేస్తే మీరు ఈజీగా బరువు తగ్గవచ్చు. వీటికి బదులుగా డ్రై ఫ్రూట్స్,నట్స్ వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే చక్కెర తక్కువగా ఉన్న తీపి పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. తీపు ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు తీపి ఎక్కువగా తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి.