మామూలుగా బరువు పెరగడం ఎంత ఈజీనో బరువు తగ్గడం అన్నది అంతకు రెండింతల కష్టం అని చెప్పాలి. ఎందుకంటే బరువు తగ్గడం అన్నది అంత సులువైన విషయం కాదు.. బరువు తగ్గడం కోసం వ్యాయామాలు చేయడం, వాకింగ్ కి వెళ్లడం, ఎక్సర్సైజులు చేయడం, డైట్లు ఫాలో అవడం ఇలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ బరువు తగ్గడానికి ఎక్కువ రోజులు కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే వాటిని పాటిస్తే వారం రోజుల్లోనే బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన శరీరానికి నీళ్లు చాలా చాలా అవసరం.
మన శరీరంలో నీరే ఎక్కువ భాగం ఉంటుందట. నీళ్లు మనం హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి నీళ్లను పుష్కలంగా తాగాలని చెబుతున్నారు. నిజానికి నీళ్లు మీరు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందట. హైడ్రేట్ గా ఉంటే ఆకలి చాలా వరకు తగ్గిస్తుందట. అలాగే ఇది జీవక్రియను పెంచుతుందట. దీంతో కొవ్వులు కరగడం మొదలవుతుందని చెబుతున్నారు. ఒక వారంలో బరువు తగ్గాలనుకుంటే ద్రవాహారం తీసుకోవాలి. అంటే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తాగాలని చెబుతున్నారు. బరువు తగ్గడానికి ద్రవ ఆహారం చాలా సహాయపడుతుందట. ఇది మీ ఆకలిని చాలా వరకు తగ్గిస్తుందట. ఒక వారం రోజుల్లో మీరు బరువు తగ్గాలనుకుంటే కార్బోహైడ్రేట్లను అస్సలు తినకూడదట. ఎందుకంటే ఇవి మీ బరువును మరింత పెంచుతాయట. మీ రోజువారి ఆహారం నుంచి రోజుకు 500 నుంచి 750 కేలరీలను తగ్గించాలని చెబుతున్నారు. ప్రోటీన్లు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఉండే ఆహారం ఫుడ్ కోరికలను చాలా వరకు తగ్గిస్తుందట.
అలాగే వీటిని తింటే మీకు ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదట. ఇది మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుందని చెబుతున్నారు.బరువు తగ్గాలనుకుంటే మీ ఆహారంలో పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఉడికించిన కూరగాయలు, సూప్, చీజ్, చికెన్, గుడ్లు, మజ్జిగను తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలట. సూప్ లు, ఉడికించిన కూరగాయలను తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి ఉండదు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. కేవలం ఒక వారం రోజుల్లో మీరు బరువు తగ్గాలనుకుంటే రోజూ కనీసం 30 నిమిషాల పాటైనా వ్యాయామం చేయాలట. ఇందుకోసం రన్నింగ్, జాగింగ్ వంటి వ్యాయామం రియల్ అని చెబుతున్నారు. 30 నిమిషాల పాటు పరిగెత్తడం లేదా వ్యాయామం చేయడం వల్ల 500 కేలరీలు బర్న్ అవుతాయట. వేగంగా బరువు తగ్గాలనుకుంటే మాత్రం రోజూ ఒకటి నుంచి రెండు గంటల పాటు యోగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి రోజూ సూర్య నమస్కారాలు, ధనురాసనం, ఉత్కటాసనం వంటి యోగాసనాలు చేయవచ్చని వీటి వల్ల తొందరగా ఫలితాలు లభిస్తాయి అని చెబుతున్నారు.