Healthy Lungs : లంగ్స్ ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి..?

Healthy Lungs ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనిషి ఎప్పుడు ప్రయత్నిస్తుంటాడు. తినే తిండి తాగే నీళ్లు దగ్గర నుంచి ప్రతి

  • Written By:
  • Publish Date - September 25, 2023 / 11:39 AM IST

Healthy Lungs ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనిషి ఎప్పుడు ప్రయత్నిస్తుంటాడు. తినే తిండి తాగే నీళ్లు దగ్గర నుంచి ప్రతి దాని మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనిషి ఆరోగ్య వంతంగా ఉండేందుకు లంగ్స్ అవే ఊపిరితిత్తులు బాగా సహకరిస్తాయి. ఊపిరి తీసుకోకుండా మనిషి బ్రతకడం కష్టం కాబట్టి ఊపిరి పీల్చడం వదలడం పని లంగ్స్ చేస్తుంటాయ్. అయితే కొన్ని కారణాల వల్ల ఊపిరి తిత్తుల పనితీరు సరిగా ఉండదు.

అస్తమా, క్షయ, స్లీప్ అప్నియా, టీబీ, అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, న్యూమోనియా, రెస్ట్ లెస్, అలసట ఇలాంటి వాటి వల్ల లంగ్స్ (Healthy Lungs) సరిగా పనిచేయవు. చాలా సందర్భాల్లో లంగ్స్ ఇన్ ఫెక్షన్ అనేది గాలితో వస్తుంది. మనం పీల్చే గాలి నుంచి కొన్ని అనారోగ్య సంస్యలు వస్తాయి. ఇదే కాకుండా ధూమపాన, మధ్యపానం, కాలుష్యం కూడా లంగ్స్ ఇన్ ఫెక్షన్ కి దారి తీస్తాయి.

సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం, కెమికల్స్, వాతావరణం లో మార్పులు కూడా లంగ్స్ సమస్యలకు దారి తీస్తాయి. వీటి నుంచి జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లంగ్స్ హెల్దీగా ఉండాలంటే పొల్యూషన్ కి దూరంగా ఉండాలి. పొగ త్రాగడం, పొగాకు తీసుకోవడం లాంటివి మానేయాలి. హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి. దీనికోసం ఎంత వర్కవుట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో అలర్జీలు, దుమ్ము లేకుండా చూసుకోండి. న్యుమోనియా వ్యాక్సినేషన్ తీసుకోవడం మర్చిపోవద్దు.

ఈ సమస్య ఉన్న వారికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్, డిసెంబర్ టైం లో వ్యాక్సిన్స్ ఇస్తారు. వైద్యుల సలహాతో ఈ వ్యాక్సిన్ చేసుకుంటే బెటర్. వాటితో పాటుగా పడని ఆహారాలను, శీతల పానియాలను కూడా దూరం చేయడం వల్ల లంగ్స్ ని ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది.

Also Read : Bigg Boss 7 : వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందా లేదా..?