Site icon HashtagU Telugu

Mental Health: మీ మెదడుకు మీరే పెద్ద శత్రువు.. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే 3 అలవాట్లు ఇవే!

Mental Health

Mental Health

Mental Health: మొత్తం శరీరం ఆరోగ్యం మెదడు ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అతని మెదడు ఆరోగ్యంగా (Mental Health) లేకపోతే అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలవుతుంది. బాగా లేనట్టు అనిపించడం, ఎప్పుడూ నిరుత్సాహంగా ఉండటం, ఏ పని చేయాలనిపించకపోవడం, నరాల నొప్పి, తినాలనిపించకపోవడం, బరువు వేగంగా తగ్గడం వంటివి నరాల సంబంధిత (Neurological) సమస్యలకు సంకేతాలు కావచ్చు. అందుకే మెదడు ఆరోగ్యం (Brain Health) సరిగ్గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం మన మెదడుకు పెద్ద శత్రువులుగా మారుతాము. ఆరోగ్య నిపుణుల ప్ర‌కారం.. మన మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసే 3 అలవాట్లు ఏమిటో చెబుతున్నారు. ఈ అలవాట్లను ఎలా అధిగమించాలో కూడా సూచించారు.

మెదడుకు అతిపెద్ద శత్రువులైన 3 అలవాట్లు

వైద్యుల‌ ప్రకారం.. మెదడుకు అత్యంత హానికరమైన 3 విషయాలు పెద్ద శ‌త్రువులుగా పేర్కొన్నారు. అందులో ఫిర్యాదు చేయడం (Complain), పోల్చుకోవడం (Compare), విమర్శించడం (Criticize) ఉన్నాయి. ఎల్లప్పుడూ ఫిర్యాదు చేయడం, మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం, మిమ్మల్ని మీరు ఎప్పుడూ తప్పుగా మాట్లాడటం మన మెదడుకు శత్రువులుగా (Brain’s Worst Enemy) నిరూపితమవుతాయని వైద్యులు తెలిపారు.

ఫిర్యాదు చేయడం: మీరు నిరంతరం ఫిర్యాదులు చేసినప్పుడు మీ మెదడు కేవలం సమస్యలనే చూస్తుంది. పరిష్కార మార్గాలను అస్సలు అన్వేషించదు.

పోల్చుకోవడం: మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం కొనసాగించినప్పుడు మీ మెదడు ఒక భిక్షగాడిలా మారుతుంది. తన ఆనందాన్ని తనలో కాకుండా బయటి వస్తువులలో వెతకడానికి ప్రయత్నిస్తుంది.

Also Read: Digital Habits Vs Heart Health: ఫోన్ విప‌రీతంగా వాడేస్తున్నారా? అయితే మీకు ఈ స‌మ‌స్య‌ల‌న్నీ వ‌చ్చిన‌ట్లే!

విమర్శించడం: మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ విమర్శించుకోవడం లేదా మీ గురించి చెడుగా మాట్లాడుకోవడం వల్ల మీలో నెగెటివిటీ పెరగడం మొదలవుతుంది. మీరు మీ చెత్త వ్యక్తిత్వంగా మారిపోతారు. భగవద్గీతలో చెప్పినట్లుగా “ఆత్మైవ హి హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపుర్ ఆత్మనః” అంటే మీ మెదడు మీ ఉత్తమ స్నేహితుడు కావచ్చు. లేదా మీ చెత్త శత్రువు కూడా కావచ్చు.

ఈ చెడు ఆలోచనల నుండి ఎలా బయటపడాలి?

ఈ ప్రతికూల ఆలోచనల నుండి బయటపడటానికి కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం, జీవితంలో ఆచరించడం మాత్రమే అవసరం అని వైద్యులు వివరించారు. ఇప్ప‌ట్నుంచి ఫిర్యాదు చేయడం (Complain) మానేసి చిన్న చిన్న విషయాల కోసం కృతజ్ఞత చూపడం ప్రారంభించండి. అది ఉదయం తాగే టీ అయినా సరే, చిన్న చిన్న విషయాలకు ధన్యవాదాలు చెప్పండి. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకునే బదులు మీ మనసులోని విషయాలను ఒక కాగితంపై రాయండి. మీరు మీ జీవితంలో సాధించాలనుకుంటున్న ఒక విషయం గురించి రాసి, దానిపై దృష్టి పెట్టండి. ఎప్పుడూ మిమ్మల్ని మీరు విమర్శించుకునే బదులు ఇతరులతో మంచిగా మాట్లాడటానికి ప్రయత్నించండి. చిరునవ్వుతో ‘గుడ్ మార్నింగ్’ చెప్పండి.

Exit mobile version