ఈ రోజుల్లో చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. అందుకు గల ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు. రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అవి సరిగా జీర్ణం కాక జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయక అనేక సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకోకూడదు. వాటి వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. అందుకే జీర్ణ వ్యవస్థను ఎప్పుడూ ఆరోగ్యం ఉంచుకోవాలి. మామూలుగా కొన్ని రకాల ఆహార పదార్థాల కాంబినేషన్ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.
అందుకే కొన్నింటిని కలిపి తీసుకోకూడదని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో పాలు పండ్లు కలిపి తినడం కూడా ఒకటి. అలా చేస్తే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. పాలకు, పండ్లకు పడదు. వాటిని ఒకేసారి తీసుకోకూడదు. అలా చేస్తే వాటి నుంచి ఏర్పడే ఆమ్లాల వల్ల శరీరానికి చాలా సమస్యలు వస్తాయి. పాలను, పండ్లను కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అల్సర్, గ్యాస్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలా జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే జీర్ణవ్యవస్థ సక్రమంగ పనిచేసేలా చూసుకోవాలి. ఒకేసారి ఎక్కువ ఆహారాన్న తినకూడదు.
ఆకలేస్తేనే తినాలి. కడుపు నిండిన భావన రాగానే తినడం ఆపేయాలి. లేట్ నైట్ ఎక్కువ తినకూడదు. టైమ్ కాని టైమ్ లో తింటే తిన్న ఆహారం అస్సలు అరగదు. కొందరు అర్ధరాత్రి దాటాక తింటుంటారు. అది అస్సలు మంచిది కాదు. కుదిరితే రాత్రి 8 లోపు తినేయాలి. రాత్రి పూట పడుకునే వరకే తిన్న అన్నం అరగాలి. అలా అయితేనే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. లేదంటే లేనిపోని సమస్యల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది. కొంతమంది రకరకాల ఫ్రూట్స్ తిన్న తర్వాత వెంటనే పాలు తాగుతూ ఉంటారు. కానీ అసలు అలా చేయకండి. ఒకవేళ పాలు పండ్లు కలిపి తీసుకోవాలి అనుకుంటే వాటికి మధ్య కొంచెం గ్యాప్ తీసుకోవడం మంచిది..