Back Pain : మీ వెన్ను నొప్పికి కారణం ఈ అలవాట్లే కావచ్చు..చెక్ చేసుకోండి..!!

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీది హడావుడిగా చేయాల్సిందే. చురుకైన జీవనం వల్ల మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అలాంటి జాబితాను నుంచి వెన్నునొప్పిని మినహించబడలేదు.

  • Written By:
  • Publish Date - July 20, 2022 / 12:30 PM IST

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీది హడావుడిగా చేయాల్సిందే. చురుకైన జీవనం వల్ల మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అలాంటి జాబితాను నుంచి వెన్నునొప్పిని మినహించబడలేదు. ఈ మధ్యకాలంలో సాధారణంగా కనిపించే వెన్నునొప్పి…కొన్ని సందర్భాల్లో యాంకైలోజింగ్, స్పాండిలైటిస్ అని పిలిచే దీర్ఘకాలిక పరిస్థితికి కారణం అవుతున్నాయి. ఇది వెన్నుముక కీళ్లలో వాపునకు కారణం అవుతోంది. మీరు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుంటే…వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అంతేకాదు ఇంట్లో కూడా కొన్ని వ్యాయామాలతో వెన్నునొప్పిని తగ్గించుకోవచ్చు. అదేలాగో చూద్దాం.

1. 30 నిమిషాలు నడవండి :
వెన్నునొప్పి…మీ నిద్రపై చాలా ప్రభావం చూపిస్తుంది. హడావుడిగా నిద్రపోవడం వల్ల వెన్నునొప్పి మరింత తీవ్రం అవుతుంది. కాబట్టి స్లీపింగ్ పొజిషన్ను సరి చేసుకోండి. ఇక వెన్నునొప్పి సమస్యతో డాక్టర్ దగ్గరకు వెళ్తే…రోజూ వాకింగ్ చేయాలంటూ సలహా ఇస్తారు. కాబట్టి ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి.

2. క్రమం తప్పకుండా వ్యాయామం :
వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. రోజూ సాయంత్రం లేదా తెల్లవారుజామున 30 నిమిషాల వ్యాయామం చేస్తే మీ వెన్నునొప్పిని ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం మీ తుంటి , వెన్ను ఎముకల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. 40 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులు తమ రోజువారీ జీవితంలో శారీరక శ్రమను తప్పనిసరిగా చేర్చుకోవాలి. దీనివల్ల మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

3. బరువు తగ్గేందుకు ప్రయత్నించండి:
శరీర బరువు వెన్నునొప్పికి దోహదం చేస్తుంది. కాబట్టి బరువు పెరగకుండా జాగ్రత్త పడండి. బరువు తగ్గడం వల్ల వీపుపై భారం తగ్గుతుంది. శరీర బరువు పెరిగే కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి రోజువారీ పోషకాలు అధికంగా ఉండే ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

4. ధూమపానం మానుకోండి :
మీరు ధూమపానం చేస్తే, ధూమపానం చేయని వారి కంటే డిజెనరేటివ్ డిస్క్ డిసీజ్ లేదా వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశం 4 రెట్లు ఎక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి. నికోటిన్, ప్రధానంగా సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులలో, మీ వెన్నెముక ఎముకలను బలహీనపరుస్తుంది. కాబట్టి వీలైనంత వరకు సిగరెట్, పొగాకుకు దూరంగా ఉండండి.

5. ఐస్ ప్యాక్ ఉపయోగించండి:
వెన్నునొప్పికి తక్షణ పరిష్కారం ఐస్ ప్యాక్. సాధారణంగా  వీపువాపు లేదా మంటతో ఇబ్బంది పడుతుంటే ఐస్ మంచి ఉపశమనంగా ఉంటుది. ఇది గట్టి కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఐస్ ప్యాక్ కు ప్రత్యామ్నాయంగా హీటింగ్ ప్యాడ్‌లను ఎంచుకోవచ్చు.