Site icon HashtagU Telugu

Meat: ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన మాంసాన్ని తింటున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Meat

Meat

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో రెఫ్రిజిరేటర్లు తప్పనిసరిగా ఉంటున్నాయి. వీటిలో కూడా అనేక రకాల మోడల్స్ ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఫ్రిడ్జ్ లో వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఐటెం కూడా ఫ్రిజ్ లోనే పెట్టడం అలవాటు చేసుకున్నారు. కూరగాయలు,పండ్లు, మాంసం, నాన్ వెజ్ ఐటమ్స్ ఇలా ప్రతి ఒక్కటి ఫ్రిజ్ లోనే స్టోర్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఫ్రిజ్లో స్టోర్ చేసి తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఫ్రిడ్జ్ లో కొన్ని వస్తువులను మాత్రమే పెట్టాలని ఏవిపడితే అవి పెట్టకూడదని చెబుతున్నారు. అయితే ఈ ఫ్రిడ్జ్ లో మాంసాన్ని పెట్టవచ్చా పెట్టకూడదా? అలా పెట్టిన తర్వాత ఆ మాంసాన్ని తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఫ్రిజ్ నుండి తీసిన మాంసాన్ని సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోతే అందులోని బ్యాక్టీరియా అనుకూల పరిస్థితుల్లో వేగంగా పెరుగుతుందట. చూడటానికి మాంసం తాజాగా అనిపించినప్పటికీ అది విషపూరితమయ్యే అవకాశం ఉంటుందట. దీనిని నివారించడానికి మాంసాన్ని తరచుగా వేడిగా లేదా చల్లగా ఉంచడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. ఫ్రిడ్జ్ లో నుంచి మాంసాన్ని బయటకు తీయగానే దాని పైభాగం త్వరగా చల్లదనని కోల్పోతుందట. లోపలి భాగం ఎక్కువసేపు చల్లగా ఉంటుందట. అయితే ఇది వండే సమయంలో రుచిలో మార్పులకు దారితీయవచ్చని, దీనివల్ల కొన్ని భాగాలు ఉడికి మరికొన్ని భాగాలు సరిగా ఉడకకపోవచ్చని చెబుతున్నారు. అందుకే ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాన్ని వండేటప్పుడు ఒకేసారి అధిక వేడితో కాకుండా అన్ని భాగాలు పూర్తిగా ఉడికేలా చూడాలట.

మాంసం సరిగ్గా ఉడకడానికి ముందుగా ఉష్ణోగ్రతను క్రమంగా పెంచాలని చెబుతున్నారు. అదేవిధంగా ఫ్రిజ్‌లో మాంసం నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉండాలట. సాధారణంగా 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం ఉత్తమం అని, ఈ ఉష్ణోగ్రత బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుందని ఫ్రిజ్‌లో మాంసాన్ని కింద ఉండే అరలో ఉంచడం వల్ల అది ఎక్కువసేపు చల్లగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఫ్రిడ్జ్ నుంచి మాంసాన్ని బయటకు తీసిన తర్వాత కొద్దిసేపు చల్లని నీటిలో ఉంచడం మంచిదని ఈ ప్రక్రియ వల్ల మాంసం చల్లగా ఉండడానికి బ్యాక్టీరియా పెరిగే అవకాశాలను తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. నీటిలో ఉంచిన తర్వాత దానిని వేడి లేదా చల్లగా ఉంచి వండటానికి ఉపయోగించవచ్చట. అలాగే ఫ్రిజ్లో పెట్టిన మాంసాన్ని ఎక్కువ రోజులు ఉంచితే ఫ్రిడ్జ్ పాడైపోతుందట. అందుకే మాంసాన్ని ఫ్రిజ్లో ఎక్కువ రోజులు పాటు స్టోర్ చేయకూడదని చెబుతున్నారు. ఫ్రిజ్‌లో పెట్టిన మాంసాన్ని వండేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటే ఆరోగ్యం పాడవకుండా ఉంటుందట. మాంసంలో బ్యాక్టీరియా తొందరగా పెరుగుతుందట. దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని రుచి కూడా మారిపోతుందని చెబుతున్నారు.