Site icon HashtagU Telugu

Pink Lips: కేవలం ఒక్క రోజులోనే పెదాలను ఎర్రగా మార్చుకోండిలా!

Pink Lips

Pink Lips

మామూలుగా చాలామందికి పెదవులు నల్లగా ఉంటాయి. వాటిని ఎర్రగా మార్చుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయినా కూడా అవి ఎర్రగా కాకుండా నల్లగానే ఉంటాయి.. అయితే ఇలా నల్ల పెదాలతో ఇబ్బంది పడేవారు తప్పకుండా కొన్ని హోమ్ రెమెడీస్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో పెదాలు పగలడం, పొడిబారటం లాంటివి జరుగుతాయి. దాంతో పెదాలపై ఒక డెడ్ లేయర్ తయారౌతుంది. దానిని తొలగిస్తే, మనకు అందమైన గులాబీ రంగు పెదాలు లభిస్తాయి.

దాని కోసం మనం మన ఇంట్లో లభించే పంచదారతో పెదాలపై స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ పోయి పెదాలు లేత గులాబి రంగులోకి మారి మెరిసిపోతాయట. అదేవిధంగా కొందరికి పెదాలు పిగ్మెంటేషన్ కి గురవుతూ ఉంటాయి. అయితే అలాంటప్పుడు పెదవుల పై నలుపు తొలగిపోయి ఎర్రగా మెరిసిపోవాలంటే ఒక హోం రెమిడీని ఫాలో అవ్వాలని చెబుతున్నారు. అదేమిటంటే పొటాటో జ్యూస్ లో పాలు పసుపు కలిపి ప్రధాన పై అప్లై చేయడం వల్ల పెదవులు గులాబీ రంగులోకి మారతాయట. అలాగే పెదాలు పదే పదే పొడి బారకుండా ఉండాలి అంటే ఇంట్లోనే లభించే షియా బటర్ లేదంటే కొబ్బరి నూనె బాదం నూనె అప్లై చేస్తే మన పెదాలను అందంగా పొడి బారకుండా చేసుకోవచ్చని చెబుతున్నారు.

అలాగే ఎక్కువగా నూనె ఉప్పు ఉండే ఆహార పదార్థాలు వీలైనంతవరకు దూరంగా ఉండాలట.. వీటికి బదులుగా పండ్లు కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అవి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుతాయని చెబుతున్నారు. ఇక, మన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దాని కోసం దాహం వేయకపోయినా వాటర్ తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అప్పుడు పెదాలు కూడా అందంగా కనపడతాయి.

note: పైన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం మీ అవగాహన కోసమే మాత్రమే అని గుర్తించాలి.