Site icon HashtagU Telugu

Use Mobile Phone: పడుకొని ఫోన్ చూస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Mixcollage 22 Jul 2024 05 49 Pm 3159

Mixcollage 22 Jul 2024 05 49 Pm 3159

ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారీ వరకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. కొందరు కేవలం కొద్దిసేపు మాత్రమే ఉపయోగిస్తే మరికొందరు ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ తోనే కాలక్షేపం చేస్తుంటారు. ఇంకొందరు మొబైల్ ఫోన్లకు బాగా ఎడిక్ట్ అయిపోయి కొద్దిసేపు మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా ఉండలేకపోతున్నాను. ఒక పూట అన్నం లేకపోయినా ఉండగలుగుతారేమో కానీ మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితులకు వచ్చారు. తినేటప్పుడు తాగేటప్పుడు చివరికి బాత్రూంలో కూడా మొబైల్ ఫోన్ వినియోగించడం అలవాటుగా చేసుకున్నారు.

మొబైల్ ఫోన్ వినియోగించేటప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు అన్నది కూడా గుర్తుంచుకోవాలి. ఎక్కువసేపు కూర్చుని మొబైల్ ఫోన్ చూడడం మంచిది కాదు. అలాగే పడుకుని మొబైల్ ఫోన్ చూడడం కూడా మంచిది కాదు. మరి మీరు కూడా మొబైల్ ఫోన్ ని తరుచుగా పడుకొని చూస్తుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే కేవలం ఫోన్ చూడటం మాత్రమే కాకుండా పడుకొని టీవీ చూసినా, పుస్తకాలు చదివినా కూడా చాలా సమస్యలు వస్తాయట. పడుకొని చూడటం వల్ల కూడా మెడపై నొప్పి వస్తుందట. మెడ దగ్గర ఎముకలు అరిగిపోతాయట.

అంతేకాదు చెవులు కూడా దెబ్బ తింటాయట. చెవుల్లో గుంయ్ అనే శబ్దం వస్తుందని, కాబట్టి వీలైనంత వరకు పడుకొని టీవీలు, ఫోన్ లు చూడకపోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పడుకొని మాత్రమే కాకుండా కూర్చుని మొబైల్ ఫోన్ వినియోగించే సమయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. కుర్చీలోనో, సోఫాలోనో కూర్చున్నప్పుడు ఫోన్ టీవీ చూడటానికి మీ మెడను ఉపయోగించకూడదు. కేవలం కంటిని మాత్రమే ఉపయోగించాలని వైద్యులు అంటున్నారు. మనం వెన్ను నిటారుగా కూర్చోవాలని, ఫోన్ చూడడానికి లేదా టెక్స్ట్ చేయడానికి మెడలు వంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ కూర్చుని మొబైల్ ఫోన్ ఉపయోగించేవారు ఒడిలో తల దిండు వంటిది పెట్టుకుని ఉపయోగించడం మంచిది అని చెబుతున్నారు.