Site icon HashtagU Telugu

Potato: బంగాళాదుంపలతో ఈజీగా బరువు తగ్గవచ్చా.. అదెలా అంటే?

Potato

Potato

పొటాటో దీనినే ఆలుగడ్డ లేదా బంగాళదుంప అని కూడా పిలుస్తూ ఉంటారు. కొన్ని ప్రదేశాలలో ఉర్లగడ్డ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ బంగాళదుంపతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా స్నాక్స్ కూడా ఎక్కువగా చేసుకుని తింటూ ఉంటారు. ఆలు చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ రకరకాల స్నాక్స్ ఐటమ్స్ చేసుకొని తింటూ ఉంటారు. ఇది చాలా మంది పొటాటో తింటే బరువు పెరుగుతారని అపోహ పడుతూ ఉంటారు. అందుకే పొటాటోకి దూరంగా ఉంటారు.

బరువు తగ్గాలి అనుకునేవాళ్లు అసలు పొటాటో తినకూడదు అని చెబుతుంటారు. కానీ పొటాటోని తీసుకునే విధంగా తీసుకుంటే బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. బంగాళదుంపని ఎలా తీసుకుంటే బరువు తగ్గవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బరువు తగ్గాలి అనుకునేవారు ఆహారంలో ఫైబర్ చేర్చుకోవాలి. ఆ ఫైబర్ పొటాటోస్ లో పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుందట. అంతేకాదు క్యాలరీల భయం కూడా ఉండదట. ఒక బంగాళాదుంప 80 కేలరీలను మాత్రమే అందిస్తుందట.bబంగాళాదుంపలలో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి6 వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయట. ఇవి మీ మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయట. శరీర కణజాలాల పెరుగుదల, అభివృద్ధికి , మరమ్మత్తుకు విటమిన్ సి చాలా అవసరం అని చెబుతున్నారు.

పొటాషియం కండరాల సంకోచాలు, ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుందట. విటమిన్ బి6 మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. కాగా ఆరోగ్యకరమైన పిండి పదార్ధాలు బంగాళాదుంపలు సంక్లిష్ట పిండి పదార్థాలను కలిగి ఉంటాయి అంటే అవి క్రమంగా , స్థిరమైన శక్తిని విడుదల చేస్తాయట. అంటే మీరు బంగాళాదుంపలను సరైన పద్ధతిలో తింటే, అది మిమ్మల్ని ఎక్కువ కాలం నిండుగా,శక్తివంతంగా ఉంచుతుందట. ఎలా తీసుకుంటే బంగాళదుంపలతో బరువు తగ్గుతారు అన్న విషయానికి వస్తే.. ఆలుగడ్డను వేయించి వాటిని తిని మేం బరువు తగ్గలేదు అనుకోవద్దు. అలా కాదు. ఉడికించిన వాటిని మాత్రమే తినాలట. ఉడికించిన వెంటనే కాకుండా ఆరనిచ్చి ఆ తర్వాతే తినాలని చెబుతున్నారు. బంగాళ దుంపను కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉండే అన్నం, రోటీ, బ్రెడ్ లతో తినకూడదట. ఇలా తింటే నిజంగానే బరువు పెరుగుతారట. అలా కాకుండా కేవలం ఉడకపెట్టిన బంగాళదుంపలను మాత్రమే తినాలని,వీటిని ప్రోటీన్ గా తీసుకోవాలని చెబుతున్నారు.