బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. బొప్పాయి ఏడాది పొడవునా లభిస్తూ ఉంటుంది. పండిన బొప్పాయిని మాత్రమే కాకుండా పచ్చి బొప్పాయిని కూడా తింటూ ఉంటారు. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తరచుగా బొప్పాయి పండుని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయట. బొప్పాయి పండును గుజ్జుగా చేసి చిన్న పిల్లలకు తినిపిస్తే చాలా మంచిదని చెబుతున్నారు. యుక్త వయసు ఉన్నవారు దోరగా ఉన్న పండుని తింటే ఇంకా మంచిదట. అయితే కేవలం బొప్పాయి పండు వల్ల మాత్రమే కాదు వాటి గింజల వల్ల కూడా అనేక పోషకాలు ఉన్నాయి. బొప్పాయి గింజల్ని తీసుకుంటే అనేక ప్రయోజనాలు అందుతాయట. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బొప్పాయి పండు జీర్ణవ్యవస్థకు చాలా మంచిదట. ఇందులో ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందట. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుందట. కాగా దోరగా ఉన్న బొప్పాయి పండు తినడం వల్ల రక్తపోటు కంట్రోల్ లో ఉంటుందట. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట.అలాగే దంతాల ఆరోగ్యానికి కూడా బొప్పాయి ఇంత బాగా పనిచేస్తుందట. కాగా బొప్పాయి విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, జింక్, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా బొప్పాయి గింజల్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. బొప్పాయి గింజల్లో కార్పైన్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందట.
మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ అయితేనే ప్రమాదమట.
చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు, హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అందుకే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలని చెబుతున్నారు. బొప్పాయి గింజల్లో ఉండే ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంలో సహాయపడతాయట. అంతేకాకుండా ఈ గింజల్లో ఒలీక్ ఆమ్లం, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కనిపిస్తాయట. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయట. బొప్పాయి గింజల్లో కార్పైన్ ఉంటుందట. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందట. ఇందులో ఉండే ఫైబర్ మలవిసర్జన ప్రక్రియను సులభతరం చేస్తుందట. మలబద్ధక సమస్యతో బాధపడేవారికి ఈ గింజలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఈ చిన్న విత్తనాలలో పపైన్, కైమోపాపైన్ వంటి ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయట.
గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి లక్షణాల్ని బొప్పాయి గింజలు తగ్గిస్తాయట. బొప్పాయి గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ఈ గింజలు జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయట. చర్మం, జుట్టు సంరక్షణ కోసం బొప్పాయి గింజల సారం లేదా నూనెను ఉపయోగించవచ్చట. పండిన బొప్పాయి నుంచి గింజలను తీసి శుభ్రంగా కడగాలట. ఆ తర్వాత వీటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలట. ఈ పొడిని నీటిలో కలిపి తాగవచ్చట. లేదా స్మూతీస్, పాలలో కూడా కలిపి తీసుకోవచ్చట. ఈ గింజల్ని ఎండబెట్టి నేరుగా కూడా తినవచ్చట. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి గింజల పొడిని గ్లాసు నీటిలో కలిపి తీసుకోవచ్చట. ఇలా తీసుకోవడం శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు.