Sinus Infection: శీతాకాలంలో వేధించే సైనస్ సమస్యను ఎదుర్కోవడం ఎలా?

శీతాకాలం వచ్చిందంటే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యం ఇన్ఫెక్షన్లు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. దగ్గు, జలుబు, తలనొప్పి, ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. చిన్నారులే కాదు పెద్దలు కూడా శీతాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆస్తమా రోగులు ఈ కాలం ఎంత వెచ్చదనంగా ఉంటే అంత మంచిది. చల్లగాలులు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అయితే చాలా మంది ఈ కాలంలో సైనస్ సమస్యతో బాధపడుతుంటారు. ముక్కు దిబ్బడ అనేది ఒక సాధారణ […]

Published By: HashtagU Telugu Desk
Sinusitis

Sinusitis

శీతాకాలం వచ్చిందంటే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యం ఇన్ఫెక్షన్లు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. దగ్గు, జలుబు, తలనొప్పి, ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. చిన్నారులే కాదు పెద్దలు కూడా శీతాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆస్తమా రోగులు ఈ కాలం ఎంత వెచ్చదనంగా ఉంటే అంత మంచిది. చల్లగాలులు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.

అయితే చాలా మంది ఈ కాలంలో సైనస్ సమస్యతో బాధపడుతుంటారు. ముక్కు దిబ్బడ అనేది ఒక సాధారణ సమస్య కావచ్చు. కానీ ఇది చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే ఈ సమస్యను ఇంటి నివారణల ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ సైనస్ వల్ల కొంతమందికి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.

సైనస్ కారణంగా తలలో బరువుగా అనిపించడ, జలుబు, ఫ్లూ, కఫం ఈ రంధ్రాలను నింపుతుంది, దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు తలలో బరువుగా అనిపిస్తుంది. ఈ సమస్యను సైనసైటిస్ అంటారు.

సైనస్ ముఖ్య లక్షణాలు
– తల, కళ్ళలో తీవ్రమైన నొప్పి

-గొంతులో బొంగురుతనం

– తేలికపాటి జ్వరం

– దవడ, బుగ్గలు, దంతాలలో నొప్పి

– వాసన కోల్పోవడం

– ఆకలి లేకపోవడం

– ముక్కు కారడం, తుమ్ములు

-కొంతమందిలో, నాసికా ఎముక పరిమాణం స్వయంచాలకంగా పెరుగుతుంది, దాని కారణంగా ఈ సమస్య ఏర్పుడుతుంది.

– ముఖం లేదా ముక్కుకు తీవ్రమైన గాయం.

– అలర్జీకారణంగా కూడా సైనస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

– సిగరెట్లు ఎక్కువగా తాగేవారిలో కూడా ఇటువంటి సమస్య వస్తుంది.

శుభ్రత పాటించాలి.
ఇంట్లో ఉండే కార్పెట్‌లు, డోర్‌మ్యాట్‌లు, పరుపులు, దిండ్లు మొదలైనవాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఎందుకంటే వాటిలో పేరుకుపోయిన దుమ్ము కణాలు అలెర్జీలకు కారణం అవుతుంది.
వంటగదిలో చిమ్నీని పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకుంటే మీకు అలర్జీ ఉంటే, ఘాటైన వాసన, పెర్ఫ్యూమ్, అగరబత్తుల వంటి వాటికి దూరంగా ఉండండి. ఏసీలో కాకుండా ఎండలో ఉంటే ఉపశమనం ఉంటుంది. లేదంటే ఒక్కసారిగా టెంపరేచర్ మారడం వల్ల కూడా సైనస్ సమస్యలు వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇంతకుముందు కోవిడ్ సోకిన వారు, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ ఇన్ఫెక్షన్ తర్వాత, ఊపిరితిత్తులు బలహీనపడతాయి. సైనస్ ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంటుంది.

  Last Updated: 28 Nov 2022, 08:24 AM IST