Sweet Food : తీపి పదార్థాలు ఎక్కువగా తింటున్నారా? ఇలా కంట్రోల్ చేసుకోండి..

అందరూ చాలాసార్లు మనం ఆకలేసినా లేదా ఏమైనా తినాలి అని అనిపించినా తీపి తినాలి అనుకుంటాము. ఎక్కువగా తీపి పదార్థాలను తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు రావడానికి కారణం కావచ్చు.

Published By: HashtagU Telugu Desk
Sweet Craving After Meal

Sweet Craving After Meal

అమ్మాయిలు ఎక్కువగా చాక్లెట్లు(Chocolates), తీపి పదార్థాలను(Sweet Food) ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఎక్కువగా తీపి పదార్థాలను తినడం వలన హార్మోన్లలో అసమానతలు, నెలసరి ఇబ్బందులు, ఇంకా అనేక అనారోగ్య సమస్యలు రావడానికి కారణం కావచ్చు. అమ్మాయిలే కాదు అందరూ చాలాసార్లు మనం ఆకలేసినా లేదా ఏమైనా తినాలి అని అనిపించినా తీపి తినాలి అనుకుంటాము. కానీ తీపి పదార్థాలు తినకుండా ఒక గ్లాసుడు మంచినీళ్ళు(Water) తాగినా మనకు తీపి తిన్న భావన కలుగుతుంది. ఏదయినా ఒక తాజా పండును మనం తిన్నా మనకు పోషకాలు అందుతాయి. మన శరీరంలో జీర్ణప్రక్రియకు మేలు జరుగుతుంది.

మన ఇంటిలో ఎక్కడ చాక్లెట్లు పెడతామో ఆ ప్లేస్ లలో ముందుగా మనం వాటిని తీసెయ్యాలి. ఫ్రిజ్, హ్యాండ్ బ్యాగ్స్, ఆఫీస్ డెస్క్ వంటి వాటిల్లో మనం చాక్లెట్లను తీసెయ్యాలి. అప్పుడు మనం తీపి పదార్థాలు తిందాము అని అనుకున్నా తినడానికి మనకు కనిపించవు కాబట్టి మనం తినడం తగ్గిస్తాము.

ఈ మధ్యకాలంలో అందరూ స్విగ్గీ, జొమోటో వంటి ఆప్స్ ఉంచుకొని దానిలో ఆర్డర్ చేసుకుంటున్నారు. నోటిఫికెషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని చూసి ఆర్డర్ చేసేస్తుంటారు. కాబట్టి ముందు మన ఫోన్స్ లో ఆప్స్ ను డిలీట్ చేయడం లేదా నోటిఫికెషన్స్ మ్యూట్ లో పెట్టడం చేయడం వలన మనం ఆర్డర్ చేసుకొని తీపి పదార్థాలు లేదా మనకు నచ్చినవి తినడం వంటివి చేయడం తగ్గిస్తారు.

రోజూ తీపి పదార్థాలు తినేవారు ఒక్కసారిగా మానెయ్యాలి అంటే కష్టంగానే ఉంటుంది కాబట్టి షుగర్ లెస్ చూయింగ్ గమ్ లు దగ్గర పెట్టుకొని నోటిలో వేసుకుంటూ ఉంటే నోటికి వ్యాయామం జరుగుతుంది. ఇంకా మనకు తీపి తినడం తగ్గుతుంది అనే భావన కలుగుతుంది. కాబట్టి మనం తీపి తినడాన్ని తగ్గించుకొని దానికి ప్రత్యామ్నాయాలను కనుక్కుంటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.

 

Also Read :  Oats Uthappam: ఎప్పుడైనా ఓట్స్ ఊతప్పం తిన్నారా.. అయితే ఇలా తయారు చేసుకోండి?

  Last Updated: 05 Jul 2023, 09:31 PM IST