ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో రక్తపోటు సమస్య కూడా ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సమస్య రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఒకటి. అయితే ఈ లో బీపీ హై బీపీ సమస్యతో బాధపడుతున్న వారు ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. బీపీని కంట్రోల్ లో ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అందుకోసం ఎన్నో రకాల మెడిసిన్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎలాంటి మెడిసిన్స్ ని ఉపయోగించకుండానే బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శరీరం బరువు పెరిగే కొద్దీ రక్తపోటు కూడా బాగా పెరుగుతుందట. బరువు ఒక్క రక్తపోటునే కాకుండా ఎన్నో వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు. అందుకే మీ బరువును అదుపులో ఉంచుకోవాలట. బరువు అదుపులో ఉంటే మీ రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందట. అలాగే ధూమపానం కూడా అధిక రక్తపోటుకు దారితీస్తుందట స్మోకింగ్ చేస్తే మీ రక్తపోటు అమాంతం పెరుగుతుందట. అంతేకాకుండా ఈ స్మోకింగ్ క్యాన్సర్ కు కూడా దారితీస్తుందని చెబుతున్నారు. ధూమపానం మానేయడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయని చెబుతున్నారు. కాగా ఉప్పు కూడా రక్తపోటును బాగా పెంచుతుందట. అందుకే బీపీ పేషెంట్లు ఉప్పును మోతాదులోనే తినాలని చెబుతున్నారు. బీపీ పెరగకూడదంటే రోజువారీ సోడియాన్ని 1500మి.గ్రా వరకు పరిమితం చేయాలట.
ఇందులో చిన్న తగ్గింపు కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందట. అలాగే మీ రక్తపోటును అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. అదేవిధంగా అతిగా ఆల్కహాల్ ను సేవించడం కూడా మీ గుండె ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. ఇది మీ గుండెను రిస్క్ లో పడేస్తుందట. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల మీ బరువు పెరగడంతో పాటుగా బీపీ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అందుకే రక్తపోటు అదుపులో ఉండాలంటే ఆల్కహాల్ ను లిమిట్ గా తాగాలట. రాత్రిళ్లు కంటినిండా నిద్రపోకపోతే కూడా మీ రక్తపోటు బాగా పెరుగుతుందని చెబుతున్నారు. అందుకే మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజు రాత్రి పూట కనీసం 8 గంటలు అయినా బాగా నిద్రపోవాలని చెబుతున్నారు. నిద్ర మిమ్మల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుందట. ఒత్తిడి లైట్ తీసుకునేంత చిన్న సమస్య కానేకాదు. ముఖ్యంగా ఇది గుండెకు అస్సలు మంచిది కాదట. అలాగే ఇది రక్తపోటును కూడా బాగా పెంచుతుందని, అందుకే ఒత్తిడికి దూరంగా ఉండడం మంచిది అని చెబుతున్నారు. ఇందుకోసం యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు చేయాలనీ చెబుతున్నారు.