చలికాలం(Winter) రాగానే చాలామందికి ముక్కు దిబ్బడ(Nasal Congestion) సమస్య వస్తుంది. చల్లని గాలి, దుమ్ము, ధూళి, పెంపుడు జంతువుల చర్మం లేదా కొన్ని ఆహార పదార్థాలు కూడా ముక్కు దిబ్బడ రావడానికి కారణం అవుతాయి. పొగ, రసాయనాలు, నాసికా లైనింగ్ వాపు వలన కూడా ముక్కు దిబ్బడ అనేది ఏర్పడుతుంది. అయితే ముక్కు దిబ్బడ తగ్గడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగించవచ్చు.
* యూకలిఫ్టస్ లేదా పుదీనా నూనెతో కలిపి ఆవిరి పీల్చితే ఇది నాసికా మార్గాలు తెరుచుకొని ఇబ్బంది లేకుండా శ్వాస పీల్చుకోవడానికి సహాయపడుతుంది.
* అల్లం టీ తాగడం వలన అల్లంలో ఉండే యాంటి వైరల్ లక్షణాలు సైనస్ లను క్లియర్ చేస్తుంది.
* పాలు వేడి చేసుకొని దానిలో కొద్దిగా పసుపు, మిరియాల పొడి కలుపుకొని, కాసేపు మరిగించి తాగితే అది ముక్కు దిబ్బడను తగ్గిస్తుంది.
* తులసి టీ తాగడం వలన నాసికా రద్దీని, నాసికా వాపును తగ్గిస్తుంది.
* త్రికటు చూర్ణం మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ముక్కు దిబ్బడను తగ్గిస్తుంది.
* యోగా ఆసనాలు, ప్రాణాయామ వ్యాయామాలు చేయడం వలన కూడా ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
* గోరువెచ్చని నీరు తాగడం వలన కూడా ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
* వేడి వేడి నీళ్ళల్లో పచ్చ కర్పూరం వేసి ఆ నీటితో ఆవిరి పట్టుకుంటే ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
Also Read : Apple Jam : టేస్టీ ఆపిల్ జామ్ రెసిపీ.. ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?