Care After Pregnancy: గర్భధారణ సమయంలో మహిళలు అనేక శారీరక, మానసిక మార్పులకు లోనవుతారు. బిడ్డ పుట్టిన తర్వాత అన్ని సమస్యలు తీరిపోయాయని చాలామంది భావిస్తుంటారు. దీనివల్ల అందరి దృష్టి తల్లి నుండి బిడ్డ వైపు మళ్లుతుంది. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే డెలివరీ తర్వాత సమయం మహిళలకు చాలా సున్నితమైనది. చాలామంది మహిళల రికవరీపై దృష్టి పెడతారు కానీ ప్రసవం తర్వాత ఎదురయ్యే శారీరక, మానసిక ఇబ్బందులను విస్మరిస్తుంటారు.
దీనిపై నిపుణులు మాట్లాడుతూ.. ఈ సమయంలో మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నీరసం, బలహీనత దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. నిపుణులు సూచించిన ఈ చిట్కాలతో మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Also Read: టాటా టియాగో CNG ఆటోమేటిక్.. తక్కువ ధరలో అత్యుత్తమ మైలేజీ, భద్రత!
తల్లి అయిన తర్వాత మహిళల్లో కనిపించే సాధారణ సమస్యలు
- విపరీతమైన అలసట, బలహీనత.
- శరీరం క్రింది భాగంలో నొప్పి లేదా అసౌకర్యం.
- నిద్రలేమి లేదా తరచుగా నిద్రకు భంగం కలగడం.
- మూడ్ స్వింగ్స్ (మానసిక స్థితిలో మార్పులు).
- ఆందోళన లేదా మొద్దుబారినట్లు అనిపించడం.
- రక్తహీనత.
మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందా?
కొన్నిసార్లు నార్మల్ డెలివరీ అయినప్పటికీ మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రసవ సమయంలో వైద్యులు లేదా నర్సులు మాట్లాడే మాటలు కూడా మహిళల మనస్సుపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. ఇది కేవలం మొదటిసారి తల్లి అయ్యే వారికే కాకుండా రెండోసారి లేదా మూడోసారి తల్లి అయ్యే మహిళల్లో కూడా జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ మానసిక వేదనను ఎందుకు గుర్తించలేరు?
ప్రసవం తర్వాత సంరక్షణలో అతిపెద్ద సవాలు ఇదే. ఎందుకంటే మానసిక బాధను ఏ రక్త పరీక్షలోనో లేదా రిపోర్టులోనో చూడలేము. బ్లడ్ ప్రెజర్ లేదా రక్తహీనతను కొలిచినంత సులభంగా మానసిక స్థితిని కొలవడం సాధ్యం కాదు.
ప్రసవం తర్వాత సొంత ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?
నిద్ర- విశ్రాంతి: డెలివరీ తర్వాత శరీరం తిరిగి కోలుకోవడానికి నిద్ర చాలా ముఖ్యం. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి. మీ కోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి.
సరైన ఆహారం: ఈ సమయంలో పోషకాహారం చాలా అవసరం. మీ డైట్‌లో ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ధాన్యాలను తప్పనిసరిగా చేర్చుకోండి.
భావాలను పంచుకోండి: హార్మోన్ల మార్పుల వల్ల మూడ్ స్వింగ్స్ రావడం సహజం. మీ మనసులోని భావాలను మీకు దగ్గరైన వారితో పంచుకోండి. ఒకవేళ విపరీతమైన విచారం లేదా ఆందోళనగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
