Site icon HashtagU Telugu

Weight Loss: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ నీరు తాగాల్సిందే?

Mixcollage 12 Jul 2024 08 54 Am 5774

Mixcollage 12 Jul 2024 08 54 Am 5774

అల్లం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరి వంట గదిలో అల్లం తప్పకుండా ఉంటుంది. తరచుగా అల్లంని డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడటంతో పాటు కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తవు. అల్లంని ఎన్నో రకాల మసాలా వంటకాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇకపోతే ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిన అల్లంని వాటర్ తో కలిపి తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. మరి అల్లం నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అల్లం నీరు తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. అల్లం నీరు ఆకలిని అణిచివేయడంతో పాటు మనం తీసుకునే కేలరీలను తగ్గించడానికి సహాయపడుతుందట. కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుందట. అసలు ఈ అల్లం నీరు ఎలా తయారు చేయాలి? అన్న విషయానికి వస్తే.. ముందు అల్లంని బాగా దంచాలి. తర్వాత నీటిలో ఈ అల్లం వేసి మరిగించి తర్వాత వడపోసుకోవాలి. అందులో కొద్దిగా నిమ్మరసం,తేనె కలుపి తాగాలి. అయితే మొదట్లో తాగడానికి కష్టంగా అనిపించినప్పటికీ అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఈ నీటి వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ప్రతీరోజు ఉదయాన్నే తాగవచ్చు. ఆ సమయంలో కుదరకపోతే రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఉదయాన్నే తాగితే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.

అయితే రోజుకి నాలుగు గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి విరోచనాలు గుండెల్లో మంట లాంటి సమస్యలు వస్తాయి. లిమిట్ గా తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపరడంతో పాటు వికారం వంతులు వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులో అసౌకర్యంగా ఉన్నప్పుడు ఈ నీటినీ తాగడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అల్లం నీరు రక్త ప్రసరణను మెరుగుపరచడం, రక్తపోటును తగ్గించడం ద్వారా హృదయ ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుందనీ చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.