Healthy Recipes : వీటిని ఎంత తిన్నా లావైపోరు తేలిగ్గా అరిగిపోతుంది…!!!

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే...కావాల్సిన పోషకాలు అందించాలి. పోషకాలు అందాలంటే...మంచి ఆహారం తీసుకోవాలి.

  • Written By:
  • Updated On - September 15, 2022 / 07:33 PM IST

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే…కావాల్సిన పోషకాలు అందించాలి. పోషకాలు అందాలంటే…మంచి ఆహారం తీసుకోవాలి. పోషకాహార లోపం కారణంగా శరీరంలో అనేక సమస్యలకు గురవుతుంది. కాబట్టి మంచి పోషకాలను అందించే కొన్ని వంటకాల గురించి తెలుసుకుందాం. మీరు బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు వీటిని తీసుకోవచ్చు. ఇవి పూర్తిగా ఆరోగ్యకరం. మధుమేహం నుంచి కొలెస్ట్రాల్, రక్తపోటు వరకు సమస్యలను నిర్దార్ధిస్తాయి.

1. పోహా:
ఉదయం బ్రేక్ ఫాస్ట్ పోహా తీసుకోండి. ఇది తిన్న వెంటనే మీకు ఆకలిగా అనిపించదు. వివిధ రకాల కూరగాయలు, వేరుశెనగలతో దీన్ని తయారు చేసుకుంటే ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలన్నింటిని అందిస్తుంది.

2. పాలకూర దోస:
పాలకూరలో విటమిన్ ఎ, ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.

3. జోవర్ రోటీ:
జొన్న రోటీలో ఫైబర్, గ్లూటెన్ ఫ్రీ పుష్కలంగా లభిస్తాయి. వాటితో పాటు మెగ్నీషియంను కలిగి ఉంటుంది, ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మేలు చేస్తుంది.

4. హమ్మస్:
ఇంట్లో తయారుచేసిన హమ్మస్ పెరుగు నూనెతో కలిపి తయారు చేస్తారు. పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆలివ్ నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన గుండెకు చాలా మంచిది.

5. మొలకెత్తిన మూంగ్ పేలు:
మొలకెత్తిన మూంగ్ కట్లెట్‌లో ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో ముఖ్యమైనది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఫైబర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.

6. రాజ్మా కర్రీ:
ఉత్తర భారతదేశంలో రాజ్మా-బియ్యాన్ని చాలా ఇష్టంగా తింటారు. రాజ్మా ప్రోటీన్ కు మంచి మూలం. ఇది తిన్న వెంటనే ఆకలిగా అనిపించదు. దీని కారణంగా ఆహారంను మోతాదుగా తీసుకుంటారు. రాజ్మాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

7. సూప్:
సూప్‌ను కూడా మీ ఆహారంలో భాగం చేసుకోండి. సూప్‌లు ఎక్కువగా కూరగాయలతో తయారు చేస్తారు. కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనానికి ముందు సూప్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. సూప్‌లను రోగనిరోధక శక్తిని పెంచుతాయి.