Site icon HashtagU Telugu

Summer: వేసవికాలంలో ప్రతిరోజు ఎన్ని లీటర్ల నీటిని తాగాలో మీకు తెలుసా?

Summer

Summer

వేసవికాలంలో మొదటి చేయాల్సిన పనులలో మంచిగా నీరు తాగడం ఒకటి. నీరు ఎంత బాగా తాగితే అంత ఆరోగ్యంగా ఉండడంతో పాటు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు కూడా దూరం ఉండవచ్చని చెబుతున్నారు. వేసవిలో శరీరానికి సరిపడా నీళ్ళు తాగడం అవసరం. ముఖ్యంగా వేసవి కాలంలో నీరు తాగడం చాలా అవసరం. ఎందుకంటే చెమట రూపంలో నీరు ఎక్కువ మొత్తంలో బయటకు పోతూ ఉంటుంది. అందుకే పగటిపూట కనీసం రెండు నుండి రెండున్నర లీటర్ల నీరు అవసరం కావచ్చు లేదా కొందరికి మూడు లీటర్ల నీరు కూడా అవసరం కావచ్చు.

ఒక పురుషుడు రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని అయినా త్రాగాలట. అయితే స్త్రీలు 24 గంటల్లో 2 లీటర్ల కంటే కొంచెం ఎక్కువ త్రాగాలట. నిజానికి మన శరీరాలు 60 శాతం నీటితో తయారవుతాయి. నీరు మన అవయవాల నుండి విషాన్ని బయటకు పంపుతుందట. ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల మెదడు కణజాలం బాగా హైడ్రేట్ అవుతుందట. ఇది తలనొప్పి, మైగ్రేన్‌ లను నివారిస్తుందని చెబుతున్నారు. అందువల్ల, తలనొప్పి, మైగ్రేన్‌ లతో బాధపడేవారు ఖాళీ కడుపుతో కనీసం ఒక గ్లాసు నీరు త్రాగాలట. అలాగే మూత్ర పిండాలలో రాళ్లు ఉన్నవారు పుష్కలంగా నీరు త్రాగాలట. నిజానికి తగినంత నీరు త్రాగకపోవడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయట.

అందుకే రోజుకు కనీసం 2 లీటర్ల నీరు త్రాగాలట. పురుషులు రోజుకు 15.5 కప్పులు లేదా 3.7 లీటర్ల నీరు త్రాగాలట. అలాగే మహిళలు రోజుకు 11.5 కప్పులు లేదా 2.7 లీటర్ల నీరు త్రాగాలని చెబుతున్నారు. నీరు త్రాగడానికి ఉత్తమమైన 5 సమయాల్లో మొదటిది ఉదయం. నిద్ర లేవగానే, రాత్రిపూట ఉపవాసం ఉన్న తర్వాత, ఉదయం మేల్కొన్న 20 నిమిషాలలోపు నీరు త్రాగడం మంచిదట. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుందట. ఈ నీటిలో నిమ్మకాయ, నెయ్యి లేదా దాల్చిన చెక్క కలపడం ఇంకా మంచిదని చెబుతున్నారు. భోజనానికి అరగంట ముందు 500 మి.లీ నీరు తాగడం బరువు తగ్గడంలో సహాయపడుతుందట. ఇది జీర్ణశయాంతర ప్రేగులను శుభ్రపరుస్తుందని,అలాగే ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుందట. శరీరం ఎక్కువగా చెమట పడుతున్నప్పుడు నీరు త్రాగడం ముఖ్యం. వ్యాయామానికి ముందు, తరువాత, స్నానానికి ముందు మంచినీరు తాగాలట. ఇది డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుందని చెబుతున్నారు.