ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యం బాగా ఉండటంతో పాటు శరీరానికి తగిన వ్యాయామం కూడా చేసినట్టు ఉంటుంది. ప్రతీ రోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. వాకింగ్ చేయడం వల్ల కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, ఇంకా ఎన్నో లాభాలు కూడా గలుగుతాయట. అసలు ఉదయం పూట ఎంతసేపు చేయాలి? దానివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉదయాన్నే వాకింగ్ చేయడం తప్పనిసరి. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం 20 నుంచి 30 నిమిషాలు ఆగకుండా వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయట.
మన శరీరం ఆరోగ్యంగా, వ్యాధులకు దూరంగా ఉండటానికి ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం. మన రోగనిరోధక శక్తి పెరగడానికి రోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంతో పాటుగా రోజూ వాకింగ్ కు వెళ్లడం కూడా అవసరం. ఉదయం ఫ్రెష్ గాలిలో కాసేపు నడవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. దీంతో మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ఉదయం వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారట. కీళ్ల నొప్పులు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల కీళ్లకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుందని చెబుతున్నారు. ఇది నొప్పిని చాలా వరకు తగ్గిస్తుందట. అలాగే మంచి అనుభూతి కూడా కలుగుతుందట. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారు ఖచ్చితంగా రోజూ వ్యాయామం చేయాలట.
ఇబ్బంది పడకుండా బరువు తగ్గాలంటే మాత్రం మీరు రోజూ బాగా నడవాలి అని చెబుతున్నారు. ఇది మీ శరీర బరువును అదుపులో ఉంచుతుందట. ముఖ్యంగా మీరు ఎంత పాస్ట్ గా నడిస్తే అంత ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయని,అలాగే ఫాస్ట్ గా బరువు తగ్గుతారని చెబుతున్నారు. కాగా ప్రస్తుత రోజుల్లో గుండె జబ్బులతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. మీరు రోజూ ఉదయం వాకింగ్ కు వెళితే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుందట. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే డయాబెటీస్ తో బాధపడే వారు ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాల పాటైనా నడవాలట. వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత మంచి హెల్తీ ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. ఉదయాన్నే వాకింగ్ కు వెళితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందట. హైబీపీతో బాధపడేవారు రోజూ ఉదయం 30 నిమిషాల పాటైనా వాకింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుందట.