Site icon HashtagU Telugu

Carrot Juice: చలికాలంలో క్యారెట్ జ్యూస్ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా.?

Mixcollage 12 Dec 2023 04 53 Pm 4605

Mixcollage 12 Dec 2023 04 53 Pm 4605

క్యారెట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. క్యారెట్ ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూర్చడంతో పాటు ఎన్నో రకాల సమస్యలను కూడా తరిమి కొడుతుంది. క్యారెట్ తీసుకోవడం వలన కంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే రక్తహీనత నుంచి రక్షిస్తుంది. క్యారెట్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. అయితే చలికాలంలో క్యారెట్ ని క్యారెట్ జ్యూస్ ని తాగవచ్చా? ఒకవేళ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలం వచ్చింది అంటే చాలు ఎన్నో రకాల సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి.

అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. అలాగే శీతాకాలంలో శరీరం చల్లగా ఉంటుంది. ఈ వాతావరణన్ని తట్టుకునే శక్తి పోషకాహారం తీసుకోవడం వలనే శరీరానికి శక్తి లభిస్తుంది. ఇక చలికాలంలో లభించే పలు రకాలైన కూరగాయలను జ్యూస్ రూపంలో తీసుకోవడం వలన పలు విధాల ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయి. అలాంటి జ్యూస్లలో క్యారెట్ జ్యూస్ కూడా ఒకటి. ఈ క్యారెట్ జ్యూస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ ఏ పుష్కలంగా ఉండి ఆహారాన్ని నిత్యం తీసుకోవడం మంచిది.

కంటి సమస్యలు రేచీకటి ఇలాంటి సమస్యలు మూల కారణం విటమిన్ ఏ లోపమే కాబట్టి ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వలన కంటి చూపుకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చలికాలంలో నిత్యం ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి అధికమవుతుంది. అలాగే శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ డామేజ్ నుంచి కాపాడటమే కాక హానికర బ్యాక్టీరియా వైరస్ ల నుంచి రక్షణ పొందడానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ తో ఇబ్బంది పడేవాళ్లు తరచూ క్యారెట్ జ్యూస్ తీసుకోవడం శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ ను తగిన మొత్తంలో మెయింటెన్ అవుతూ ఉంటాయి. క్యారెట్ లో ఉండే క్యాలరీలు విటమిన్లు మినరల్స్ మధుమేహాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. క్యారెట్ జ్యూస్ లో ఉండే బీటా కెరోటిన్ గుండె జబ్బులకు దారి తీసే ప్రియురాడికల్స్ ను పోరాడడానికి చాలా ముఖ్యం. క్యారెట్ జ్యూస్ లో విటమిన్ సి ఈ అలాగే పొలిట్స్ లాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కారణంగా చెడు ఈ ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ జరగకుండా తగ్గిస్తుంది.