Site icon HashtagU Telugu

Water: ప్రతిరోజు ఎన్ని నీళ్లు తాగాలి.. మోతాదుకు మించి తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Water Protein

Water Protein

ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు సరైన మోతాదులో నీరు తీసుకోవాలి. నీరు తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నీరు శరీరంలోని మలినాల్ని బయటకు పంపించడంలో ఎంతో మేలు చేస్తాయి. అలాగే బాడీని హైడ్రేట్ గా ఉంచుతాయి. అయితే వాటర్ తాగే విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. నిలబడి తాగకూడదని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని ఆయాస పడుతున్నప్పుడు వాటర్ తాగకూడదని రన్నింగ్ చేసిన వెంటనే తాగకూడదని చెబుతుంటారు. మామూలుగా టాయిలెట్ వెళ్లాక దాహం వేస్తుంది.

కొంతమంది అలా బాత్రూం కి వెళ్లి రాగానే వాటర్ తాగుతారు. ముఖ్యంగా ఆఫీసుల్లో వర్క్ చేసే ఉద్యోగులు బ్రేక్ టైం లో వాష్ రూమ్ వెళ్లి వచ్చి వెంటనే వాటర్ తీసుకుంటున్నారు. మూత్రం వెళ్లాక నీరు తాగడం అనేది మంచిది కాదట. అయితే మూత్రం వెళ్లడం అనేది మూత్ర పిండాలు మృత్వశ్యానికి సంబంధించిన ప్రక్రియ. టాయిలెట్ వెళ్ళాక వెంటనే వాటర్ తీసుకుంటే మూత్రాషయం పై ఎక్కువ ఒత్తిడి పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా మూత్రపిండాల సాధారణ పనితీరు పై ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది తెలిపారు. అలాగే లంగ్స్ కు సంబంధించిన వ్యాధులు, అంటూ వ్యాధులు లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మూత్ర విసర్జన చేసిన తర్వాత శరీరంలో ద్రవాల స్థాయి కొంత తగ్గుముఖం పడుతుంది.

కడుపు ఉబ్బడం, పొత్తి కడుపులో నొప్పి అసౌకర్యంగా అనిపించడం గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్టర్ పై ఎఫెక్ట్ చూపించడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఇన్ఫ్లమేషన్, హైపోనా ట్రెమియా లాంటి సమస్యలు వస్తాయి. టాయిలెట్ చేశాక ఎంత విరామం తర్వాత వాటర్ తాగాలో కూడా నిపుణులు తెలిపారు. టాయిలెట్ తర్వాత ఎప్పుడైనా సరే దాదాపు 20 నిమిషాల క్యాప్ తర్వాత వాటర్ తాగాలని వెల్లడించారు. ఈ గ్యాప్ లో నీరు తాగితే శరీరానికి కూడా రిలీఫ్ ఉంటుందట.