Green Chilles: ఏంటి పచ్చిమిరపకాయలు తింటే.. అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చా?

మన వంటింట్లో దొరికే కూరగాయలలో పచ్చిమిర్చి కూడా ఒకటి. ఈ పచ్చిమిర్చి లేకుండా చాలా రకాల వంటలు పూర్తి కావు. ఇవి కూరకు స్పైసీని తేవడంతో పాటు కూ

  • Written By:
  • Publish Date - July 3, 2024 / 03:00 PM IST

మన వంటింట్లో దొరికే కూరగాయలలో పచ్చిమిర్చి కూడా ఒకటి. ఈ పచ్చిమిర్చి లేకుండా చాలా రకాల వంటలు పూర్తి కావు. ఇవి కూరకు స్పైసీని తేవడంతో పాటు కూరకు రుచిని కూడా పెంచుతాయి. వీటిని మనం ప్రతిరోజు వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. కొందరు కూరల్లో తినడానికి ఇష్టపడితే మరి కొందరు పచ్చిగా కూడా తింటూ ఉంటారు. ఇంకొందరు పచ్చిమిరపకాయ అంటే బాబోయ్ కారం అని దూరం పెట్టేస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పచ్చిమిరపకాయలలో ఎన్నో రకాల పూసలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు వైద్యులు.

మరి పచ్చి మిరపకాయ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది ఆహారంలో పచ్చిమిరపకాయ ముక్క వస్తే దాన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అయితే పచ్చిమిరపకాయలు తినడం ఎంతో మేలు చేస్తుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. కాగా వీటిల విటమిన్ ఏ, విటమిన్ బి 6, విటమిన్ సి, ఐరన్, కాపర్, ప్రోటీన్, పొటాషియం, కార్బోహైడ్రేట్ వంటి అనేక పోషకాలు ఉంటాయట. పచ్చిమిరపకాయ లలో బీటా కెరోటిన్, లుటిన్ జియాక్సంథిన్, క్రిప్టోక్సాంటిన్ లాంటి చాలా రకాల ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. అందుకే పచ్చిమిరపకాయలను ఆహారంలో భాగంగా చేసుకుని తింటే మంచిదని చెప్తున్నారు.

అయితే చాలా ఎక్కువగా పచ్చిమిరపకాయలను తినడం కూడా ఆరోగ్యానికి హాని చేస్తుందని చెప్తున్నారు. ఈ పచ్చిమిరపకాయలు మన శరీర బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చాలామంది ఊబకాయం కారణంగా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు ఎండుకారానికి బదులుగా పచ్చిమిరపకాయలు కారంతో కూరలు వండుకొని తింటే మంచిదట. ఇది బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు నిపుణులు. పచ్చిమిరపకాయలతో క్యాన్సర్ సమస్యకు చాలా వరకు దూరంగా ఉండొచ్చని, పచ్చిమిరపకాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి క్యాన్సర్ ప్రమాదం నుంచి కాపాడతాయని చెబుతున్నారు. అదేవిధంగా పచ్చిమిరపకాయలు మీ జీర్ణ వ్యవస్థను సజావుగా నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్తున్నారు.

అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పచ్చిమిరపకాయలు దోహదం చేస్తాయని చెప్తున్నారు. ఇతర సమస్యల నుండి గుండెకు రక్షణ కల్పించడానికి పచ్చిమిరపకాయలు ఎంతగానో పనిచేస్తాయని చెప్తున్నారు. పచ్చి మిర్చి వల్ల 50 శాతం జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. పచ్చిమిరపకాయలలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. అలాగే ఇవి చర్మాన్ని సంరక్షించడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు.

Note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గమనించాలి. ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది.