Site icon HashtagU Telugu

Washing Feet: రాత్రి సమయంలో కాళ్లు కడుక్కొని పడుకోవడం వల్ల కలిగే లాభాలివే!

Mixcollage 05 Mar 2024 02 04 Pm 3475

Mixcollage 05 Mar 2024 02 04 Pm 3475

కాళ్లు కడుక్కోవడం.. ఇది చాలా మంచి అలవాటు. మనం బయట ఎక్కడైనా తిరిగి వచ్చినప్పుడు ఇంట్లోకి ప్రవేశించే ముందుగా శుభ్రంగా కాళ్లు కడుక్కోమని చెబుతూ ఉంటారు. అందుకే పూర్వకాలంలో నీళ్లు బయటపెట్టి ఇంటికి వచ్చిన అతిథులకు కాళ్లు కడుక్కోమని చెప్పి నీరు పెట్టేవారు. కేవలం అప్పుడు మాత్రమే కాకుండా చాలా సందర్భాలలో చాలామంది పాదాలను శుభ్రంగా కడుక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా కొందరికి రాత్రి సమయంలో కాళ్లు కడుక్కొని పడుకోవడం అలవాటు. అలా చేయడం వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే నిద్రలేమి సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు.

అలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే రాత్రి పడుకునే సమయంలో కాళ్లు కడుక్కొని పడుకోవాలి. రోజంతా పనిచేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి సమయంలో పడుకునే ముందు కాళ్ళను కడగడం చాలా అవసరం. కానీ అలా చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. రోజు పడుకునే ముందు కాళ్లు కడుక్కొని పడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిరోజు పడుకునే సమయంలో కాళ్ళను కడిగి పడుకోవడం వలన కాళ్లు దృఢత్వం పెరుగుతుంది. కాళ్ల నొప్పి, తిమ్మిర్లు కూడా తగ్గుతాయి. పడుకునే ముందు మీ పాదాలను కడుక్కోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

పాదాలలో నొప్పి ఎక్కువగా ఉంటే పాదాలను కడుక్కొని పడుకోవాలి. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర పడుతుంది. రాత్రి పడుకునే సమయంలో పాదాలు కడుక్కోవడం చాలా ముఖ్యం. కాళ్లుకు ఎక్కువగా చెమట పట్టే వారి హైడ్రోస్ అంటారు. అటువంటి వ్యక్తి రాత్రి సమయంలో కాళ్లు కడుక్కొని పడుకోవాలి. ఇలా చేయడం వలన మీ పాదాలలో బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది. చల్లని లేదా గోరువెచ్చని నీటితో మీ కాళ్ళని కడుక్కోవచ్చు. ఒక టబ్ లో నీటిని తీసుకొని దాంట్లో కొన్ని నిమ్మకాయ ముక్కలను వేసి దానిలో మీ కాళ్ళను కొద్దిసేపు ఉంచుకోవాలి. కొద్దిసేపు పాటు ఉంచిన తర్వాత మీ కాళ్ళను బయటికి తీసి తడి ఆరిన తర్వాత ఆయిల్ అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మీ కాళ్లకు మంచి ఉపశమనం కలుగుతుంది. వేడిగా ఉన్న వారి పాదాలు కచ్చితంగా రాత్రి సమయంలో పడుకునే ముందు కాళ్ళను కడుక్కొని పడుకోవాలి.