Site icon HashtagU Telugu

Eggs: ప్రతిరోజు ఎన్ని కోడిగుడ్లు తినాలో మీకు తెలుసా?

Mixcollage 22 Jun 2024 11 14 Am 8853

Mixcollage 22 Jun 2024 11 14 Am 8853

కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కోడిగుడ్డులో ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ కోడి గుడ్డును చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి భయం లేకుండా తినవచ్చు. కాగా కోడిగుడ్డులో ఎన్నో పోషకాలు ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. అయితే కోడి గుడ్డును తినడం మంచిదే. రోజుకు ఎన్ని కోడిగుడ్లు తినాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న విషయాలు చాలా మందికి తెలియదు..

మరి కోడిగుడ్లు రోజుకు ఎన్ని తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కోడిగుడ్లు ఆరోగ్యానికి మంచివే కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. గుడ్డు తినడం వలన మీ బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే గుడ్డులో ఎన్నో కేలరీలు ఉన్నాయి. గుడ్డు తినడం వలన మన కడుపు నిండినట్టుగా ఉంటుంది. దాంతో మనం ఆహార పదార్థాలు తినలేము. ఆహారం తినకపోతే ఈజీగా బరువు తగ్గుతాను. అలాగే గుడ్డు కంటికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీ ఆహారంలో గుడ్డును చేర్చడం వలన కంటి నరాల క్షీణత నుంచి కాపాడుతుంది. అంతేకాదు రోజు గుడ్డు తినడం వలన శుక్లాల ప్రమాదం కూడా తగ్గుతుంది.

అలాగే గుడ్డు మీ శరీరంలోని రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. దాని వలన మీకు బిపి, గుండె జబ్బులు రావడం చాలా వరకు తగ్గుతుంది. రోజు గుడ్డు తినే వాళ్ళలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా చాలా తక్కువ. అంతేకాదు గుడ్డు తీసుకోవడం వలన మీ మెదడు నరాల పనితీరు చాలా మెరుగుపడుతుంది. అంటే వయస్సు పైబడిన తరువాత వచ్చే వ్యాధులు గుడ్డు తినే వాళ్ళలో వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎప్పుడైనా మీకు శక్తి తగ్గినట్టుగా అనిపిస్తే వెంటనే ఒక గుడ్డు తినండి.

గుడ్డు మీ శరీరానికి ఇన్స్టంట్ ఎనర్జీని అందిస్తుంది. అలాగే సోమరితనాన్ని కూడా దూరం చేస్తుంది. అందుకే గుడ్డుని ఎనర్జీ బూస్టర్ అని కూడా పిలుస్తారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజూ రెండు నుంచి మూడు గుడ్లు తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండేవారు వారానికి 7 నుంచి 10 గుడ్లు తినాలి. అథ్లెట్లు, వర్కౌట్స్ చేసే వారికి ప్రొటీన్లు ఎక్కువగా అవసరపడతాయి. వారు రోజుకు నాలుగు నుంచి ఐదు గుడ్లు తినవచ్చు. మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తుంది. అయితే కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు మాత్రం వైద్యుడి సలహా మేరకు గుడ్డు తినడం మంచిది..

Exit mobile version