ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య కారణంగా చాలామంది వారి సొంత పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక అధిక బరువు తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో చిట్కాలు మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ మంచి ఫలితాలు కనిపించవు. అయితే ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఎలాంటి డైట్ ఫాలో అవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బరువు తగ్గాలి అనుకున్న వారు అల్పాహారంలో గుడ్లను చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు.
తరచుగా డైట్లో భాగంగా కోడిగుడ్లను చేర్చుకోవడం వల్ల అది మీకు రోజంతా శక్తిని ఇవ్వడంతో పాటు ఈజీగా బరువు తగ్గేలా చేస్తుందట. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ గా కోడిగుడ్డును తీసుకోవడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అల్పాహారంగా రెండు నుంచి మూడు కోడిగుడ్లను తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. మీ రోజును 2-3 గుడ్లతో ప్రారంభించడం వల్ల మధ్యాహ్న ఆకలి బాధలు తగ్గుతాయట. అనారోగ్యకరమైన ఆహారాలు తినాలనే కోరిక కూడా తగ్గుతుందట. ఇది మీరు అతిగా తినకుండా కూడా నిరోధిస్తుందట. మీ శరీరానికి అవసరమైన ముఖ్యమైన వాటిలో ప్రోటీన్ ఒకటి. ఒక్కో గుడ్డులో దాదాపు 6 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ ఉంటుంది.
గుడ్లు ప్రోటీన్ మాత్రమే కాదు, అవి విటమిన్లు బి 12, డి వంటి ముఖ్యమైన పోషకాలతో మొత్తం ఆరోగ్యానికి అవసరమైన ఇనుము జింక్ వంటి ఖనిజాలతో నిండి ఉంటాయట. అయితే గుడ్లు తినాలి అని చాలామంది ఎలా పడితే అలా తింటూ ఉంటారు. ముఖ్యంగా వేయించుకొని ఎక్కువగా తింటూ ఉంటారు. అలా తినకూడదని వేయించిన గుడ్ల కంటే ఉడికించిన గుడ్లు ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు. ఉడికించిన గుడ్లు కేలరీల సంఖ్యను అదుపులో ఉంచుతాయట. మీకు వేయించిన గుడ్లు కావాలంటే, తక్కువ నూనెను ఉపయోగించాలని చెబుతున్నారు.