Site icon HashtagU Telugu

Eggs: ప్రతిరోజు ఎన్ని కోడిగుడ్లు తీసుకోవాలి.. గుడ్లు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే?

Mixcollage 05 Feb 2024 12 26 Pm 592

Mixcollage 05 Feb 2024 12 26 Pm 592

గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాది అన్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. గుడ్డు శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకపదార్థాలను కలిగి ఉంటుంది. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. విటమిన్ బి 12, విటమిన్ డి అలాగే ఇతర యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి, దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి. గుడ్డును తరచుగా తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

గుడ్లు ఎక్కువగా తీసుకోవటం వలన కడుపు సంబంధింత వ్యాధులు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఒక క్రమ పద్దతిలో రోజుకు ఎన్ని గుడ్లు తినాలి అన్న విషయానికి వస్తే.. ఒక రోజులో ఎక్కువ గుడ్లు తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. గుడ్డు సొనలలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. గుడ్డు పచ్చసొనలో సుమారు 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. రోజువారీ సిఫార్సు స్థాయి రోజుకు 300 మిల్లి గ్రాములు కంటే ఎక్కువ కాదు. ఒక గుడ్డు లోని పచ్చసొన తిన్న వచ్చే ఇబ్బంది ఏమి లేదు. మరి ఒక రోజులో ఎన్ని గుడ్లు తినవచ్చు అనే దానికి సరైనా సమాధానం చెప్పటం కష్టం. ఇది వ్యక్తికి వారి మొత్తం ఆరోగ్యానికి భిన్నంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి వారానికి ఏడు గుడ్లు వరకు ఎలాంటి భయం లేకుండా తినవచ్చు.

మీరు ఎటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడకపోతే, రోజులో మూడు గుడ్లు వరకు సులభంగా తినవచ్చు. గుడ్లు చాలా ఆరోగ్యకరమైనవి. ఇవి అధిక పోషకాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఆహారంలో వాటిని భాగం చేసుకొని తినవచ్చు. కాకపోతే వేసవిలో ఎక్కువ గుడ్లు తీసుకుంటే, శరీరంలో వేడి పెరుగుదలకు అవి కారణం కావచ్చు. ఇది ప్రేగు కదలికలో సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా, ఇది అతిసారానికి కూడా దారితీస్తుంది, ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో కాబట్టి వేసవిలో వాటిని నియంత్రించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవటం కూడా ఒక రకంగా ఆరోగ్యానికి కూడా హానికరం. కాబట్టి రోజు వారి ఆహారంలో గుడ్డును భాగం చేసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు రోజుకు రెండు చొప్పున గుడ్లు తినవచ్చు.