ప్రసవం తర్వాత పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి?

దీనితో పాటు తేలికపాటి శారీరక శ్రమ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజూ నడక లేదా తేలికపాటి వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Periods

Periods

Periods: గర్భధారణ, ప్రసవ అనుభవం మహిళా శరీరంలో అనేక పెద్ద మార్పులను తీసుకువస్తుంది. అటువంటి సమయంలో కొత్తగా తల్లయిన మహిళల మనస్సులో మెదిలే అత్యంత సాధారణ ప్రశ్న “డెలివరీ తర్వాత పీరియడ్స్ ఎప్పుడు తిరిగి వస్తాయి?”. దీనికి సమాధానం ప్రతి మహిళకు భిన్నంగా ఉండవచ్చు. సాధారణంగా పీరియడ్స్ 6 వారాల నుండి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయంలోపు తిరిగి రావచ్చు. ఇది పూర్తిగా సదరు మహిళ తల్లి పాలు (Breastfeeding) ఇస్తుందా లేదా, ఆమె హార్మోన్ల స్థితి, శరీరం ఎంత వేగంగా కోలుకుంటుంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.

2023 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5) ప్రకారం భారతదేశంలో దాదాపు 65 శాతం మంది మహిళలకు డెలివరీ అయిన 6 నెలల లోపు మొదటి పీరియడ్ వస్తుంది. అయితే పూర్తిస్థాయిలో తల్లి పాలు ఇచ్చే మహిళల్లో పీరియడ్స్ 18 నెలల వరకు కూడా వాయిదా పడవచ్చు.

డెలివరీ తర్వాత పీరియడ్స్ తిరిగి రావడాన్ని ప్రభావితం చేసే కారణాలు

ప్రసవం తర్వాత పీరియడ్స్ తిరిగి రావడం అనేది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో అత్యంత కీలక పాత్ర తల్లి పాలు ఇవ్వడం. తల్లి పాలు ఇచ్చే సమయంలో శరీరంలో ప్రోలాక్టిన్ (Prolactin) అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది పాలు తయారవడానికి సహాయపడుతుంది. అండోత్పత్తిని అణిచివేస్తుంది. అందుకే పగలు-రాత్రి క్రమం తప్పకుండా, పూర్తిస్థాయిలో తల్లి పాలు ఇచ్చే మహిళల్లో పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల‌ ప్రకారం.. ఇది శరీరంలో జరిగే ఒక సహజ ప్రక్రియ. ఇది తర్వాతి గర్భధారణకు మధ్య విరామం ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. డెలివరీ తర్వాత పీరియడ్స్ చాలా నొప్పిగా ఉండవచ్చు. ఒకవేళ ఇబ్బంది ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.

Also Read: మహమ్మద్ యూనస్ ఒక హంతకుడు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

పీరియడ్స్‌ను మళ్లీ క్రమబద్ధం చేయడంలో ఎలా సహాయపడాలి?

డెలివరీ తర్వాత శరీరం మళ్లీ సమతుల్యతలోకి రావడానికి సరైన సంరక్షణ అవసరం. ఇందులో మొదటగా పోషణ, నీటి పాత్ర అత్యంత కీలకం. సమతుల్య, పోషకమైన ఆహారం హార్మోన్ల బ్యాలెన్స్ కాపాడటంలో, శరీరం కోలుకోవడంలో సహాయపడుతుంది. ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం డెలివరీ సమయంలో జరిగిన రక్త నష్టాన్ని భర్తీ చేయడంలో సహాయపడతాయి. అదేవిధంగా చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్స్ వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు వాపును తగ్గించడంలో, శరీరాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. తగినంత నీరు త్రాగడం కూడా ముఖ్యం. ఎందుకంటే దీనివల్ల శరీరంలోని అన్ని ప్రక్రియలు మెరుగ్గా పనిచేస్తాయి.

వ్యాయామం కూడా సహాయపడుతుంది

దీనితో పాటు తేలికపాటి శారీరక శ్రమ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజూ నడక లేదా తేలికపాటి వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మూడ్‌ను కూడా బాగుంచుతుంది. పోస్ట్‌నాటల్ యోగా, తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు శరీరానికి ఫ్లెక్సిబిలిటీని తిరిగి తీసుకురావడంలో సహాయపడతాయి. దీనివల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి పీరియడ్స్ క్రమంగా సాధారణ స్థితికి వస్తాయి.

  Last Updated: 23 Jan 2026, 10:40 PM IST