Food Tips : ఆహారాన్ని ఎంతకాలం పాటు ఫ్రిజ్ లో నిల్వ చేయవచ్చు?

ఆహారాన్ని ఫ్రిజ్‌లో (Fridge) ఎంతకాలం పాటు నిల్వ ఉంచొచ్చు? ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఫుడ్ ను ఎప్పటిలోగా తినడం మేలు?

ఆహారాన్ని (Food) ఫ్రిజ్‌లో ఎంతకాలం పాటు నిల్వ ఉంచొచ్చు? ఫ్రిజ్‌(Fridge) లో నిల్వ చేసిన ఫుడ్ ను ఎప్పటిలోగా తినడం మేలు? అనే సందేహం చాలామందికి ఉంటుంది. అయితే పలువురు ఆరోగ్య నిపుణులు మాత్రం.. వండిన ఆహారాన్ని  ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్‌లో (Refrigerator) నిల్వ చేయొద్దని సూచిస్తున్నారు. వాస్తవానికి వండిన ఆహారాన్ని గాలి చొరబడని ఒక కంటైనర్‌లో కనిష్టంగా 2-3 రోజులు, అనేక సందర్భాల్లో ఒక వారం పాటు నిల్వ చేయొచ్చు.అదే ఫ్రీజర్‌లో అయితే విద్యుత్ కోతలు అస్సలు లేకుంటే.. ఆహారాన్ని (Food) ఆరు నెలల వరకు నిల్వ చేయొచ్చు. “ఫ్రిజ్ లోని అత్యల్ప ఉష్ణోగ్రత వల్ల ఫుడ్స్ లోని జీవసంబంధ కార్యకలాపాలు మందగిస్తాయి. ఫలితంగా అది పాడయ్యే సమయం కూడా పెరుగుతుంది.” అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అది అపోహ మాత్రమే:

ఆహారాన్ని ఫ్రిజ్ లో ఉంచితే లేదా చల్లబరిస్తే అందులోని పోషకాలు నశిస్తాయనే అపోహ చాలామందికి ఉంటుంది. అది నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ వండే సమయంలోనే వేడి వల్ల చాలా పోషకాలు ఆవిరి అవుతాయి. ఫ్రిజ్ లో ఫుడ్ ను ఉంచినప్పుడు నీటిలో కరిగే విటమిన్లు కొన్ని నశిస్తాయి. అయితే, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. సాదా వండిన లేదా ఉడికించిన అన్నం కొన్నిసార్లు చల్లగా ఉన్నప్పుడు బ్యాక్టీరియా బారినపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రిజ్ లో ఉంచిన ఫుడ్ ను ఒకటి, రెండు రోజుల్లోనే తినడం బెస్ట్. అదృష్టవశాత్తు భారతీయ ఆహారం కారంగా, ఉప్పగా, పుల్లగా ఉంటుంది. కాబట్టి ఇది “ప్రత్యేకంగా ఫ్రిజ్-ఫ్రెండ్లీ”.

ఫుడ్ (Food) పాయిజనింగ్ గండం:

మాంసం, పౌల్ట్రీ, చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి పాడైపోయే ఆహారాలు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసేందుకు అనువైనవి. ఇక రొట్టె, పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం ఫ్రిజ్ లో నిల్వ చేయబడతాయి.  3 నుంచి 4 రోజుల తర్వాత రిఫ్రిజిరేటెడ్ లో మిగిలిపోయి ఉండే ఫుడ్స్ లో బాక్టీరియా పెరుగుతుంది.దీనివల్ల  ఫుడ్ పాయిజనింగ్ ముప్పు చుట్టుముడుతుంది. బాక్టీరియా సాధారణంగా ఆహారం యొక్క రుచి, వాసన, రూపాన్ని మార్చదు. ఫలితంగా, ఆహారం సురక్షితంగా ఉందో లేదో మీరు చెప్పలేరు. కాబట్టి ఫ్రిజ్ లో ఉంచిన ఏదైనా ఫుడ్ పై డౌట్ వస్తే.. దాన్ని తినకుండా వదిలివేయడం శ్రేయస్కరం.

బ్యాక్టీరియా పెరుగుదల ఎందుకు జరుగుతుంది?

మనలో ఎవరూ వంట చేసిన వెంటనే ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచరు. ఆహారం తినే వరకు బయటి వాతావరణంలోనే ఉంచుతారు. తిన్నాక మిగిలిపోయిన వాటిని గది ఉష్ణోగ్రతకు చల్లబరుస్తుంది. అనంతరం ఫుడ్ ను ఫ్రిజ్ లో నిల్వ చేస్తారు. ఫలితంగా సూక్ష్మ జీవులు పెరిగి ఆహారాన్ని కలుషితం చేసే ఛాన్స్ లు పెరుగుతాయి.  అందుకే మిగిలిపోయిన ఫుడ్స్ ని గాలి చొరబడని కంటైనర్లలో భద్రపరచండి అని చెబుతారు. ఇలా చేయలేకపోతే కనీసం ఫుడ్ ను కప్పి ఉంచాలి.

Also Read:  Immunity : రోజూ తలస్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందా?